Let's talk: editor@tmv.in
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మావోయిస్టు అగ్రనేతలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మావోయిస్టు అగ్రనేతలు

Gaddamidi Naveen
28 ఫిబ్రవరి, 2026

ఇటీవల లొంగిపోయిన (జనజీవన స్రవంతిలో) కలిసిన మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి సహా మరో నలుగురు నేతలు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఫిబ్రవరి 24న పోలీసుల ఎదుట లొంగిపోయిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ బృందం, ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస కార్యక్రమాలపై చర్చించేందుకు ఈ భేటీకి హాజరయ్యారు.

ముఖ్యమంత్రితో భేటీ అయిన వారిలో పుల్లూరి ప్రసాద్ రావు (చంద్రన్న), పోతుల కల్పన (సుజాత), బాడే చొక్కారావు (దామోదర్), నూనె నరసింహారెడ్డి (గంగన్న) కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతి పాల్గొన్నారు. హింసను వీడి ప్రధాన స్రవంతిలోకి వచ్చిన వీరిని ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించింది.