Let's talk: editor@tmv.in
సీఎం రేవంత్ రాజకీయ ధోరణిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

సీఎం రేవంత్ రాజకీయ ధోరణిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

Gaddamidi Naveen
19 జనవరి, 2026

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం సభలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నువ్వు ముఖ్యమంత్రివా లేక ఒక ముఠా నాయకుడివా? అని ప్రశ్నిస్తూ, సీఎం వ్యాఖ్యలు అసాంఘిక చర్యలను ప్రోత్సహించేలా ఉన్నాయని మండిపడ్డారు.

కేటీఆర్ త‌న ఎక్స్ వేదిక ద్వారా శాంతిభద్రతలను కాపాడాల్సిన హోంమంత్రి హోదాలో ఉండి, ఒక రాజకీయ పార్టీ జెండా గద్దెలను ధ్వంసం చేయాలని పిలుపునివ్వడం రాజ్యాంగ విరుద్ధమని కేటీఆర్ ధ్వజమెత్తారు. పదేళ్లపాటు లా అండ్ ఆర్డర్‌లో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో, నేడు అరాచక శక్తులు రాజ్యమేలడం రాష్ట్రానికి పట్టిన దరిద్రమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పీకల్లోతు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, అందుకే రేవంత్ రెడ్డికి మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆయ‌న‌ ఎద్దేవా చేశారు.

సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితేనే అరెస్టులు చేసే పోలీసులు, స్వయంగా ముఖ్యమంత్రే దాడులకు ఉసిగొల్పుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర డీజీపీ తక్షణమే స్పందించి సీఎం వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ తరపున డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ పాట పాడటం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని కేటీఆర్ ఆరోపించారు. అయితే, రేవంత్ రెడ్డి అధ్యక్షతలోని ప్రభుత్వ క్రమనిర్వహణలో జలహక్కులు, నిధులు, నియామకాల విషయంలో పాతబాసు ఆదేశాల మేరకే తెలంగాణకు నష్టం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీతో చీకటి ఒప్పందాలు, టీడీపిని రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ చేర్చే ప్రయత్నాలు, రాష్ట్రానికి చేసిన ద్రోహం వలన సీఎం రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.

రేవంత్ రెడ్డిది వెన్నుపోట్ల చరిత్ర: మాజీమంత్రి హ‌రీష్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను మాజీమంత్రి హ‌రీష్ రావు ఘాటు విమర్శలు చేశారు. రాజకీయ ప్రయాణంలో ప్రతీ అడుగులోనే వెన్నుపోట్లు, నిరంతర అబద్ధాలు రేవంత్ రెడ్డి ద్రోహ బుద్ధితో నిండిన వ్యక్తి అని హ‌రీష్ రావు పేర్కొన్నారు. ఆయన త‌న ఎక్స్ వేదిక ద్వారా విమ‌ర్శించారు, చంద్రబాబు తరపున ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి నోట్ల బ్యాగులు మోస్తూ పట్టుబడిన ‘ఓటుకు నోటు’ దొంగ, ఎన్టీఆర్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన టీడీపీ నేత, కేంద్రంలోని బీజేపీతో చీకటి ఒప్పందాలు చేస్తూ కాంగ్రెస్ ను వంచిస్తున్న నాయకుడు ఇవన్నీ రేవంత్ రాజకీయ చరిత్రను ద్రోహమయినదిగా చూపిస్తున్నాయని హ‌రీష్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో సీఎం హోదా దాటి, భౌతిక దాడులకు, ఆస్తి ధ్వంసానికి పిలుపునివ్వడం, భద్రతలను తుప్పికొడుస్తూ, ప్రజల మధ్య అసంఘటనలు ప్రేరేపించడం రాజ్యాంగానికి విరుద్ధమని హ‌రీష్ రావు హెచ్చరించారు.రేవంత్ రాజకీయంగా ఎదుర్కోలేక, బీఆర్ఎస్ జెండాలపై హింసను ప్రేరేపిస్తూ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించేందుకు ప్రోత్సహిస్తున్నారని ఇది సాక్ష్యం. డీజీపీని స్పందించి, ఈ చర్యలకు రాజ్యాంగ పరంగా తగిన చర్యలు తీసుకోవాలని హ‌రీష్ రావు డిమాండ్ చేశారు.