
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొండపల్లి
FL - SIMHCLM
30 సెప్టెంబర్, 2025
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజక వర్గం , దత్తిరాజేరు మండలంలోని దత్తి గ్రామం లో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కోసం ఏర్పాట్లను రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ , సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి, జిల్లా ఎస్.పి ఏ.ఆర్.దామోదర్ తో కలిసి పరిశీలించారు. హెలిపాడ్ నుండి ప్రజావేదిక వద్దకు, పింఛన్ దారుల గృహాల వద్దకు ముఖ్యమంత్రి వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. వాహనాల పార్కింగ్, పొలిటికల్ ప్రతినిధుల సమావేశానికి ఏర్పాటు చేసిన హాల్ ను, ముఖ్యమంత్రి విశ్రాంతి కోసం ఏర్పాటు చేస్తున్న గ్రీన్ రూమ్ ను తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా పింఛన్ అందుకొనున్న లబ్ధిదారుల గృహాలను కూడా తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది కూడా హాజరై ప్రోటోకాల్స్ ను , పాటించవలసిన నిబంధనలను వివరించారు.
