
సీఎం నమ్మకాన్ని నిలబెడతా!
తనపై నమ్మకముంచి టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడకి మంచి పేరు తెచ్చేలా కష్ట పడి పనిచేస్తానని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చోడె వెంకట పట్టాభిరామ్ పేర్కొన్నారు. బుధవారం ఋషికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆయన టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తమ ఇంటి ఇలవేలుపు శ్రీ వెంకటేశ్వర స్వామికి సేవ చేయడంలో తనకు మంచి సంతృప్తి, ఆనందం ఉంటాయన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ పార్టీలో కస్టపడి పనిచేసే వారికి ఎప్పుడూ పదవులు వస్తూనే ఉంటాయని, అందుకు తనకు అధిష్టానం పిలిచి స్పీకర్ పదవి ఇవ్వడమే నిదర్శన మన్నారు.
ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్, నగర మేయర్ పీలా శ్రీనివాస్ రావు, విఎంఆర్డిఎ చైర్మన్ మానం ప్రణవ గోపాల్, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ పట్నం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, డిప్యూటీ మేయర్ దల్లి గోవింద రెడ్డి, పట్టాభిరామ్ సతీమణి పద్మజ, ఎమ్మెల్యే వెలగపూడి సతీమణి సృజన పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
