Let's talk: editor@tmv.in
సీఎం ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై క‌విత ఎన్నిక‌ల కమిషనర్ ఫిర్యాదు

సీఎం ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై క‌విత ఎన్నిక‌ల కమిషనర్ ఫిర్యాదు

Gaddamidi Naveen
4 డిసెంబర్, 2025

గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి, ప్రభుత్వ ధనాన్ని వినియోగించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ, ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరింది.

ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన మక్తల్, కొత్తగూడెం సభల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మంత్రులు, ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉండి పనులు చేయించే సర్పంచ్‌లను గెలిపించాలని ఓటర్లను కోరారు అని. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని క‌విత‌ పేర్కొంది.ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యక్రమాల ముసుగులో ప్రజా ధనాన్ని వినియోగించి అధికార పార్టీ తరఫున ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ, ఈ అంశాన్ని ఇప్పటికే నవంబర్ 30న రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి లిఖిత పూర్వకంగా తీసుకువచ్చినట్లు క‌విత‌ తెలిపారు. అయితే ఇప్పటివరకు ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు అని పేర్కొంటూ, తక్షణమే విచారణ జరిపి ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ఎన్నిక సంఘ‌న్ని క‌విత కోరారు. తద్వారా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని క‌విత‌ డిమాండ్ చేసింది.

సీఎం ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై క‌విత ఎన్నిక‌ల కమిషనర్ ఫిర్యాదు - Tholi Paluku