Let's talk: editor@tmv.in
సీఎంల‌ దగ్గరికి మేం వెళ్లం.. సీఎంలే మా దగ్గరికి వస్తారు: అక్బరుద్దీన్ ఓవైసీ

సీఎంల‌ దగ్గరికి మేం వెళ్లం.. సీఎంలే మా దగ్గరికి వస్తారు: అక్బరుద్దీన్ ఓవైసీ

Gaddamidi Naveen
10 ఫిబ్రవరి, 2026

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా కరీంనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం నేతలు ఎప్పుడూ ముఖ్యమంత్రుల దగ్గరకు వెళ్లరని, వారే తమ దగ్గరకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అక్కడ ఉన్నది రెడ్డి అయినా, రావు అయినా.. ఎవరైనా సరే మా దగ్గరకు రావాల్సిందే. ఎంఐఎం మద్దతు లేకుండా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవగలిగిందా? అని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో ఎంఐఎం మద్దతు ఎంత కీలకమో ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ సోదరులు తమ అసలైన సత్తా ఏంటో చూపిస్తారని, ప్రతిపక్షాలకు బుద్ధి చెబుతారని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన వేళ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.