Let's talk: editor@tmv.in
సీఎంని కలిసిన టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో ముద్దాడ రవిచంద్ర

సీఎంని కలిసిన టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో ముద్దాడ రవిచంద్ర

Panthagani Anusha
10 ఫిబ్రవరి, 2026

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో) అదనపు బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ముద్దాడ రవిచంద్ర సోమవారం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా సీఎంతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రికి తిరుమల శ్రీవారి ప్రసాదాలను అందజేసి టీటీడీలో ప్రస్తుతం కొనసాగుతున్న పాలనాపరమైన అంశాలు, భక్తుల సౌకర్యార్థం తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రికి ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న రవిచంద్రకు అదనంగా టీటీడీ బాధ్యతలు అప్పగించడంతో ఆయన పాలనా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా రవిచంద్రను అభినందిస్తూ తిరుమల పవిత్రతను కాపాడటంతో పాటు సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలియుగ వైకుంఠమైన తిరుమల ప్రతిష్టను మరింత పెంచేలా పారదర్శకమైన సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు.