Let's talk: editor@tmv.in
సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో ఉద్యమం తప్పదు: హరీష్ రావు

సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో ఉద్యమం తప్పదు: హరీష్ రావు

Gaddamidi Naveen
10 జనవరి, 2026

తెలంగాణ రాజకీయాల్లో సిద్దిపేట జిల్లా రద్దు అంశం ఇప్పుడు చిచ్చు రేపుతోంది. జిల్లాల పునర్విభజన పేరుతో సిద్దిపేట జిల్లాను రద్దు చేసి, తిరిగి సంగారెడ్డిలో కలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం సిద్దిపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్, సీనియర్ నాయకులు హనుమంత్ రావు తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం జరిగిన సభలో హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై యుద్ధం ప్రకటించారు. ఒకప్పుడు సిద్దిపేటలో మంచినీళ్ల కొరత తీవ్రమే. నీళ్ల కోసం పిల్లలు ఇస్తూ కూడా భయపడేవారు. పందులు, మురికి కాలువలు, సైకిళ్ల మీద నీళ్ళు మోసే బాధలు సిద్దిపేటను గుర్తింపు పొందేలా చేశాయి. ఇప్పుడు నీటి సమస్యలతో పాటు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, వీధి దీపాలు, చెత్త సేకరణ వంటి వ్యవస్థలు ఏర్పాటు అయ్యాయి. సిద్దిపేట అభివృద్ధిలో మోడల్‌గా నిలిచిందని అన్నారు.

వీదేవిధంగా, సిద్దిపేట విద్యాక్షేత్రంలో కూడా ముఖ్యమైన మార్పులు జరిగాయని హరీష్ అన్నారు. మెడికల్ కాలేజ్, పాలిటెక్నిక్, ఫార్మసీ, నర్సింగ్, మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు అవడం ద్వారా విద్యార్థులకు బాగా అవకాశం లభించిందని పేర్కొన్నారు. వైద్య, విద్య, పర్యాటక రంగాల్లో సిద్దిపేట ఇప్పటికే ఇతర జిల్లాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని, కోమటి చెరువు పర్యాటక కేంద్రంగా పరిణమించిందని హరీష్ చెప్పారు.

సిద్దిపేట అస్తిత్వంపై దెబ్బకొడితే ఊరుకోం

30నుంచి 40 సంవత్సరాల కలను కేసీఆర్ నిజం చేసి సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి జిల్లాలు ఎక్కువాయని సాకు చూపి సిద్దిపేట జిల్లాను రద్దు చేసి, సంగారెడ్డిలో కలపాలని కుట్ర చేస్తున్నారు. జిల్లా రద్దయితే కలెక్టరేట్, మెడికల్ కాలేజ్, జిల్లా ఆసుపత్రి, ఎస్సీ ఆఫీస్, ఇరిగేషన్ ఆఫీసులు అన్నీ నష్టపోతాయని. సిద్దిపేట అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, సిద్దిపేట అస్తిత్వాన్ని కాపాడుతాం. అవసరమైతే మరో ఉద్యమం చేస్తాం అని అన్నారు.

అలాగే, పెన్షన్లు, మహిళా సంక్షేమం, బతుకమ్మ కిట్, రైతుబంధు వంటి పథకాలపై రేవంత్ రెడ్డి అందని బాధ్యతలను హరీష్ ఉదహరించారు. 25 నెలలుగా పింఛన్ అందని వ్యక్తులు, మహిళలకు ఇవ్వాల్సిన నగదు, బంగారం వంటి బకాయిలను ఆయన ప్రస్తావించారు. కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు, కిట్, నగదు అందేవి. ఇప్పుడు అందం లేదు. ఎరువులు సరఫరా అవ్వడం లేదు, రైతుబంధు అందడం లేదు. అందని సమస్యలను రేవంత్ రెడ్డి పరిష్కరించలేకపోతున్నాడు అని హరీష్ అన్నారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హరీష్ రావు అన్నారు, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మనవాళ్లే గెలవాలి. కౌన్సిలర్, చైర్మన్ మనవాళ్లే ఉంటే అభివృద్ధి కొనసాగుతుంది. సిద్దిపేట అంటే నా కుటుంబం. దసరా, రంజాన్, ప్రతి వేడుకలో ప్రజలతోనే ఉంటా. నా శక్తినంతా సిద్దిపేట అభివృద్ధికే ధారపోశాను. కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యేవరకు, తెలంగాణ బాగుపడేవరకు రేవంత్ రెడ్డితో కొట్లాడుతాం, విడిచిపెట్టే అవకాశం లేదని హరీష్ అన్నారు.