
సిట్ విచారణకు హాజరైన నటుడు రానా దగ్గుబాటి
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌పై నమోదైన కేసులో భాగంగా ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో పలువురు సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా విచారణకు పిలవబడిన విషయం తెలిసిందే.
తెలంగాణలో వేగంగా పెరుగుతున్న అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు, అలాగే సంబంధిత కేసులను సమగ్రంగా దర్యాప్తు చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వం సీఐడి అధికారి అదనపు డీజీపీ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఇటీవల ఏర్పాటు చేసింది.విచారణ అనంతరం రానా మీడియాతో మాట్లాడిన రానా, ఏమి జరిగిందో జరిగిపోయింది.ఇకపై ఇలాంటి గేమింగ్ యాప్‌ల గురించి సరైన సమాచారాన్ని, బాధ్యతాయుతమైన సందేశాలను ప్రజలకు చేరవేయడంపై దృష్టి పెట్టనున్నాం అని తెలిపారు.
తెలంగాణ గేమింగ్ చట్టం, 2017 ప్రకారం అన్ని రకాల ఆన్‌లైన్ బెట్టింగ్ నిషేధించబడింది. ఈ ఏడాది మార్చిలో పలు ఫిర్యాదుల నేపథ్యంలో అక్రమ బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు, ప్రచారకర్తలు, ప్రమోటర్లపై కేసులు నమోదయ్యాయి. యువత, సాధారణ ప్రజలను ‘సులభంగా డబ్బు సంపాదన’ పేరుతో ఈ యాప్‌లు ఆకర్షించి,ఆ తరువాత తీవ్రమైన ఆర్థిక నష్టాలు, మానసిక ఒత్తిడి, అప్పులబాధలు కొన్నిసార్లు ఆత్మహత్యల దాకా తీసుకెళ్లినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.ఈ యాప్‌లను సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం చేసిన నిర్వాహకులు, సినీ తారలు, యూట్యూబర్లు సోషల్ మీడియా ప్రభావశీలులపై తెలంగాణ రాష్ట్ర గేమింగ్ చట్టం, 2017తో పాటు బీఎన్ఎస్, ఐటీ చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు.
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసు నేపథ్యం:
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల కేసులకు సంబంధించిన నేపథ్యం 2025 మార్చిలో ప్రారంభమైంది. సైబరాబాద్ ప్రాంతంలో అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై అనేక ఫిర్యాదులు రావడంతో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో నిర్వాహకులు, ప్రమోటర్లు, సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు నిందితులుగా చేర్చబడ్డారు.ఈ నేపథ్యంలో, నటుడు రానా దగ్గుబాటి ముఖ్యంగా జంగ్లీ రమ్మీ అనే యాప్‌ను ప్రచారం చేసినందుకు సంబంధించిన అంశాలపై వివరణ ఇవ్వడానికి ఎస్‌ఐటీ ఎదుట హాజరయ్యారు.
