
‘సిగ్మా’ టీజర్ చూశారా?
హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘సిగ్మా’ . ఈ సినిమా ద్వారా కోలీవుడ్ స్టార్ ‘దళపతి’ విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. తాజాగా మంగళవారం నాడు ఈ చిత్ర టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
టీజర్‌ను గమనిస్తే, ఇదొక విభిన్నమైన యాక్షన్ కామెడీ అడ్వెంచర్ చిత్రమని స్పష్టమవుతోంది. సందీప్ కిషన్ సరికొత్త మేకోవర్‌తో ఆకట్టుకోగా, జాసన్ సంజయ్ మేకింగ్ స్టైల్ సినిమాపై అంచనాలను పెంచింది. యాక్షన్, కామెడీ మేళవింపుతో సాగే ఈ అడ్వెంచరస్ జర్నీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సులు, కెమెరా వర్క్, విజువల్ టోన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇందులో మిస్టరీతో పాటు భావోద్వేగాలు కూడా ప్రధానంగా ఉండబోతున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సాంకేతికంగా కూడా ఈ సినిమా హై స్టాండర్డ్స్‌ను అందుకునేలా కనిపిస్తోంది.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి 2026 కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. తమన్ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు ప్రధాన బలంగా నిలిచింది. టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. ‘సిగ్మా’ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకాన్ని ఈ టీజర్ బలంగా చాటుతోంది.
