
సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ రైలుకు కోచ్‌ల పెంపు
సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రస్తుతం ఉన్న 14 కోచ్‌ల నుండి ఇప్పుడు 18 కోచ్‌లకు అప్‌గ్రేడ్ చేయడం జరిగింది.
"సికింద్రాబాద్-తిరుపతి, తిరుపతి-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు కోచ్‌లను శాశ్వతంగా పెంచారు," అని దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని విజయవాడ డివిజన్ నుండి సోమవారం ఆలస్యంగా ఒక అధికారిక ప్రకటన వెలువడింది.
సికింద్రాబాద్ నుండి తిరుపతికి అలాగే తిరుపతి నుండి సికింద్రాబాద్ నడిచే వందే భారత్ రైలుకు శాశ్వత ప్రాతిపదికన నాలుగు అదనపు కోచ్‌లను పెంచారు.
నవంబర్ 26 నుండి సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్లే రైలు నంబర్ 20701, తిరుపతి నుండి సికింద్రాబాద్ కు వెళ్లే రైలు నంబర్ 20702 లో నాలుగు అదనపు ఎయిర్ కండిషన్డ్ చైర్ కార్ కోచ్‌లను జోడించడం జరిగింది. దీంతో ఈ తరహా కోచ్‌ల సంఖ్య 14 నుండి 18కి పెరుగుతుంది.
అయితే, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లలో ఎటువంటి మార్పు ఉండదు, అవి రెండుగానే ఉంటాయి. అయితే త్వరలో ఈ రైలులో మొత్తం కోచ్‌ల సంఖ్య 16 నుండి 20కి పెరుగుతుందని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఏప్రిల్ 2023లో సెకంద్రాబాద్ నుండి తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించినప్పటి నుండి, తిరుపతి శ్రీవారిని దర్శించుకోవాలని కోరుకునే భక్తులకు ఇది ఆధునిక, సమర్థవంతమైన, సౌకర్యవంతమైన రైలు ప్రయాణానికి చిహ్నంగా మారింది.
భక్తుల నుండి వందే భారత్ రైలు సేవకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మద్య రైల్వే అభ్యర్థన మేరకు రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ జీ కోచ్‌ల సంఖ్యను 14 నుండి 18 కి పెంచడానికి అంగీకరించారు. ఇది భక్తులందరికీ రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, అనుకూలంగా, వేగవంతంగా మారుస్తుంది.
