
సింగపూర్ ఏఐ హ్యాకథాన్‌లో నీల్‌సాఫ్ట్–ఆర్‌ఎస్‌పీకి తొలి స్థానం
సింగపూర్‌కు చెందిన ఆర్‌ఎస్‌పీ ఆర్కిటెక్ట్స్ ప్లానర్స్ అండ్ ఇంజినీర్స్, భారత సంస్థ నీల్‌సాఫ్ట్ లిమిటెడ్ కలిసి సింగపూర్‌లో నిర్వహించిన ఆటో డెస్క్ టాండెమ్ , ఏఐ హ్యాకథాన్ లో మొదటి స్థానం సాధించాయి. సింగపూర్, మలేషియాల నుంచి ప్రముఖ సంస్థలు పాల్గొనడంతో ఈ పోటీ అత్యంత ఉత్కంఠగా జరిగింది. ఈ హ్యాకథాన్‌కు న్యాయనిర్ణేతలుగా ఆటోడెస్క్ సౌత్ఈస్ట్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ ఐవి రైనర్, ఇంటర్నేషనల్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫ్రాంక్ న్గో, సీబీఎం పిటిఇ లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డెరెక్ యో వ్యవహరించారు. నీల్‌సాఫ్ట్–ఆర్‌ఎస్‌పీ విజేతగా నిలిచిన యూజ్‌కేస్, 2030 నాటికి పూర్తికానున్న న్యూ యునైటెడ్ వరల్డ్ కాలేజ్ (యూడబ్ల్యూసీ) క్యాంపస్ ప్రాజెక్ట్‌పై ఆధారపడి ఉంది. డిజైన్ పోటీ ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను ఆర్‌ఎస్‌పీ సాధించగా, మల్టీ-డిసిప్లినరీ లీడ్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తోంది. ప్రాజెక్ట్ విజన్‌ను భవిష్యత్‌కు అనుగుణమైన డిజిటల్ ట్విన్ పరిష్కారంగా రూపాంతరం చేయడంలో నీల్‌సాఫ్ట్ కీలక పాత్ర పోషించింది.
ఈ సందర్భంగా నీల్‌సాఫ్ట్ సొల్యూషన్స్ బిజినెస్ ప్రెసిడెంట్ రాఘురామ్ ఎన్.ఎం. మాట్లాడుతూ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ను రియాక్టివ్ విధానం నుంచి, బీఐఎమ్, డేటా అనలిటిక్స్ ఆధారిత ప్రోఆక్టివ్ ఆస్తి నిర్వహణ దిశగా తీసుకెళ్లడమే మా లక్ష్యం. ఆటోడెస్క్ టాండమ్ డిజిటల్ ట్విన్‌కు గ్లోబల్ సొల్యూషన్ ప్రొవైడర్‌గా, మేము ఒక ప్రెడిక్టివ్ డిజిటల్ ట్విన్‌ను అభివృద్ధి చేశామని తెలిపారు.
ఈ పరిష్కారం ద్వారా ‘వెల్’ బిల్డింగ్ స్టాండర్డ్‌లోని 10 అంశాల్లో 7 అంశాలను డ్యాష్‌బోర్డులు, డేటా ఇంటెలిజెన్స్‌తో ప్రదర్శించినట్లు చెప్పారు. నీల్‌సాఫ్ట్ గ్లోబల్ మార్కెటింగ్ హెడ్ ప్రశాంత్ చుండూరి మాట్లాడుతూ డిజైన్ ఉద్దేశం, ఆపరేషనల్ ఇంటెలిజెన్స్, భవన వినియోగదారుల శ్రేయస్సును ఒకే పరిష్కారంగా మలచగలిగిందే ఈ విజయానికి కారణం. ఏప్రిల్ 2026 నుంచి భారత్‌లో పెద్ద ప్రాజెక్టుల కోసం ప్రత్యేక డిజిటల్ ట్విన్ ప్రాక్టీస్‌ను ప్రారంభించేందుకు నీల్‌సాఫ్ట్ ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు.
ఈ ప్రాక్టీస్ ద్వారా ఆసుపత్రులు, విమానాశ్రయాలు, కార్పొరేట్ క్యాంపసులు, ఫ్యాక్టరీలు, పారిశ్రామిక ప్లాంట్లకు సేవలు అందించనున్నట్లు తెలిపారు.
నీల్‌సాఫ్ట్ లిమిటెడ్ గురించి
నీల్‌సాఫ్ట్ ఒక టెక్నాలజీ ఆధారిత ఇంజినీరింగ్ సేవల సంస్థ. ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్షన్, మాన్యుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ ప్లాంట్ రంగాలకు డిజిటలైజేషన్, ఆటోమేషన్ పరిష్కారాలను అందిస్తోంది. సంస్థకు 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.
