Let's talk: editor@tmv.in
‘సాస్కి’ నిధులను సద్వినియోగం చేసుకోవాలి: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

‘సాస్కి’ నిధులను సద్వినియోగం చేసుకోవాలి: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Dantu Vijaya Lakshmi Prasanna
5 నవంబర్, 2025

గ్రామీణ ప్రాంతాలో రహదారులకు రూ.2 వేల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది. సాస్కి(స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ పథకం) నిధులతో నిర్మించే రోడ్లలో ఎక్కడ నాణ్యతా ప్రమాణాలు తగ్గకూడదు. నాణ్యతా ప్రమాణాల విషయంలో బాధ్యత అధికార యంత్రాంగానిదే. నిర్మాణ దశ నుంచి పూర్తయ్యే వరకూ క్వాలిటీ చెక్ చేస్తాము. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి గారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకంలో మరో ముందడుగు వేస్తున్నాము. ప్రజలకు ఆ నిధుల ఫలాలు అందించాలంటూ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులకు ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

దెబ్బ తిన్న రోడ్లకు మొదటి ప్రాధాన్యం

వివరాలలోకి వెళితే రాష్ట్రంలోని గ్రామాల్లో రహదారుల స్థితిగతులను మార్చి నూతన రోడ్లు నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సాస్కి’ (స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ పథకం) ద్వారా ఆంధ్ర ప్రదేశ్ కు రూ. 2 వేల కోట్లు నిధులు సమకూర్చింది. ఈ నిధులను సద్వినియోగం చేసుకొని, ప్రజలకు పటిష్టమైన రహదారులు అందించే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బ తిన్న పంచాయతీరాజ్ రోడ్లను పునర్నిర్మించే కార్యక్రమం చేపడుతున్నామని, ఇందులో బాగా దెబ్బ తిన్న రోడ్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం మూలంగా రాష్ట్రానికి సాస్కి నిధులు సమకూరాయని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వీటిని సద్వియోగం చేసుకుందామన్నారు. సాస్కి నిధుల వినియోగించే ప్రణాళికపై పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.

రహదారుల నాణ్యతలో రాజీపడబోము

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ప్రత్యేక శ్రద్ధతో మన గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు అభివృద్ధికి తీసుకువచ్చిన నిధులు ఇవి. వీటి ఫలాలు ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులుపైనా, అధికార యంత్రాంగంపైనా ఉంది. ప్రతి నియోజకవర్గంలో రోడ్లు మెరుగుపడే విధంగా నిధులు సమకూరుస్తున్నాము. ఎక్కడా నాణ్యత విషయంలో రాజీపడవద్దు. రహదారుల నిర్మాణంలో నిబంధనలకు అనుగుణంగా, ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో పరిశీలించాల్సిన బాధ్యత అధికారులదే. నిర్మాణం కాంట్రాక్టు పొందినవారికీ ముందుగానే నాణ్యతా ప్రమాణాల గురించి తెలియచేయండి. ఆ ప్రమాణాలకు తగ్గట్లు నిర్మిస్తున్నదీ లేనిదీ తనిఖీ చేయడం అవసరం. నిర్మాణం మొదలయ్యాక పలు దశల్లో క్వాలిటీ చెక్ చేయాలి. నేను, నిపుణులు క్షేత్ర స్థాయికి వెళ్ళి నాణ్యతా ప్రమాణాలు పాటించారో లేదు తనిఖీ చేస్తాము. ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏ మాత్రం అవకతవకలు జరిగినా ఉపేక్షించవద్దు అన్నారు.

ప్రతి గ్రామానికీ మంచి రహదారులు ఉండాలి

ప్రజలకు పటిష్టమైన రోడ్లు అందించడం అవసరం. మౌలిక వసతుల కల్పనలో రహదారులు కీలకమైనవి. సాస్కి ద్వారా వస్తున్న రూ.2వేల కోట్లతో ప్రాధాన్యత క్రమంలో రోడ్లు నిర్మించుకొనే అవకాశం వచ్చింది. ప్రత్యేకమైన ప్రాంతాల్లో, సందర్భాల్లో ఈ నిధుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయవచ్చు. పుట్టపర్తిలో శ్రీ సత్య సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా అక్కడ మౌలిక వసతులు కల్పనలో భాగంగా పంచాయతీ రోడ్లు పటిష్టపరచాలని ప్రజా ప్రతినిధులు, అధికారులు వివరించారు. ఇందుకోసం రూ.35 కోట్లను ఈ నిధుల నుంచి వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి కీలకమైన అభివృద్ధి పనులకు సాస్కి నిధులు ఎంతగానో తోడ్పడతాయి.

రోడ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం పూర్తి అలక్ష్యంతో వ్యవహరించింది. వివిధ మార్గాల్లో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ, దానిని విస్మరించింది. కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి పనులకు నిధులు సాధిస్తోంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. నిధులు పొందటంలో, వాటిని వినియోగించే ప్రక్రియలో ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు తగిన సూచనలు అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించాలని కృత నిశ్చయంతో ఉంది. ఇందులో అధికార యంత్రాంగం కీలక భూమిక పోషించాలన్నారు.

పవన్ కళ్యాణ్ కు ఒక గుర్తింపు

కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు ఉపముఖ్య మంత్రిగా తన ఖాతాలో ఎటువంటి క్రెడిట్ ను వేసుకొని పవన్ ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజాల్లో గుర్తింపు పొందే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ మాటల మనిషి కాదు, రహదారుల నిర్మాణం లో ముండదుగువేసి కేంద్రం నుండి నిధులు రాబట్టడమేకాదు ,వాటిని సద్వినియోగ పరిచి చేతలమనిషి అనిపించుకుంటాడు. దీని ద్వారా అతని రాజకీయ విమర్శకులకు చెక్ పెట్టినట్టు వుంటుంది..

'స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్'అంటే ఏమిటి .

ఇది కేంద్ర ప్రభుత్వం రా యంత్రాలు మొదలైన ఆస్తుల కొనుగోలు, నిర్మాణంపై చేసే ఖర్చు పెంచడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన పథకం.

లక్ష్యం: రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడం, ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం ఉద్యోగాలను సృష్టించడం.

నిధుల స్వరూపం: కేంద్ర ప్రభుత్వం ఈ సహాయాన్ని రాష్ట్రాలకు 50 సంవత్సరాల వడ్డీ లేని రుణంగా అందిస్తుంది.

ప్రారంభం: కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం ప్రారంభించబడింది.

వినియోగం: ఈ నిధులను రాష్ట్రాలు ఆరోగ్య సంరక్షణ, విద్య, నీటి సరఫరా, సాగునీరు, విద్యుత్, రోడ్లు, వంతెనలు, రైల్వేలు వంటి వివిధ రంగాలలో మూలధన ప్రాజెక్టుల కోసం ఉపయోగించవచ్చు.

విభాగాలు: ఈ పథకం అనేక విభాగాలుగా విభజించబడింది, ఇందులో పట్టణ సంస్కరణలు, వాహనాల స్క్రాపింగ్, పర్యాటక కేంద్రాల అభివృద్ధి, డిజిటల్ మౌలిక సదుపాయాలు మొదలైన నిర్దిష్ట సంస్కరణలకు లేదా రంగాలకు నిధులు కేటాయించడం జరుగుతుంది. రాష్ట్రాలలో మూలధన పెట్టుబడి పెరిగితే, అది దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి మరియు స్థిరమైన అభివృద్ధికి దోహదపడుతుంది.

"స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్" పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు అందిన నిధుల వివరాలు ఇక్కడ ఉన్నాయి:

ఇటీవల విడుదలైన నిధులు (2024-25 ఆర్థిక సంవత్సరం):

• ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ₹2,200 కోట్లు మంజూరు చేయడానికి అంగీకరించింది.

• ఇందులో భాగంగా, తొలి విడతగా ₹1,500 కోట్లు ఇటీవల విడుదలయ్యాయి. ఈ నిధులను ముఖ్యంగా అమరావతి నిర్మాణ పనుల కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపునకు వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

గత ఆర్థిక సంవత్సరాలలో విడుదలైన మొత్తం నిధులు (2020-21 నుండి 2022-23 వరకు):

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌కు 2020-21 నుండి 2022-23 ఆర్థిక సంవత్సరాల మధ్య ఈ పథకం కింద ₹7,295.35 కోట్లు విడుదలయ్యాయి:

2020-21: ₹688.00 కోట్లు

2021-22: ₹501.79 కోట్లు

2022-23: ₹6,105.56 కోట్లు

అంటే, 2020-21 నుండి 2022-23 వరకు మొత్తం విడుదలైన మొత్తం ₹7,295.35 కోట్లు*.

‘సాస్కి’ నిధులను సద్వినియోగం చేసుకోవాలి: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ - Tholi Paluku