Let's talk: editor@tmv.in
సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర, అసభ్య పోస్టుల నియంత్రణ

సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర, అసభ్య పోస్టుల నియంత్రణ

FL - YUGDR
28 సెప్టెంబర్, 2025

విశాఖపట్నం రెంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి సోషల్ మీడియాలో అసభ్య, అభ్యంతరకర పోస్టులపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలో గల అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, మరియు శ్రీకాకుళం జిల్లా ల ఎస్పీలతో సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం లో విశాఖపట్నం రేంజ్ పరిధిలో గల వివిధ జిల్లాల ఎస్పీ లతో పాటు, డిఎస్పీ లు కూడా పాల్గొన్నారు.

సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తూ మహిళలను అగౌరవ పరుస్తూ పోస్టులు పెడుతున్నారని, ప్రతీ పోస్టును కుణ్ణంగా పరిశీలిస్తున్నామని, పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తప్పవని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

ఇటీవల ఇటువంటి పోస్టులు పెడుతున్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి జిల్లాలో నోడల్ ఆఫీసర్ ను నియమించి ఆయన పర్యవేక్షణలో ప్రత్యేక బృందాల ద్వారా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతర పరిశీలన చేసి అభ్యంతకర పోస్టులు పెట్టిన వ్యక్తులను గుర్తించి, వారు పెట్టిన పోస్ట్ ఏ కేటగిరికి వస్తుంది?. వారిపై ఎటువంటి చర్యలు చేపట్టారు మొదలగు అంశాలపై రోజువారి నివేదిక ఇవ్వాల్సిందిగా డీఐజీ అధికారులను ఆదేశించారు.

తరచుగా అభ్యంతకర పోస్టులు పెట్టి వారిన వివరములు సేకరించాలని, వారిపై మరియు వారికీ సహకరిస్తున్న వ్యక్తులను వ్యవస్థీకృత నేరము చేసినట్లుగా పరిగణించి, వారిపై వ్యవస్థీకృత నేరానికి సంబందించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాల్సిఉంటుందని స్పస్టమైన ఆదేశాలు ఇచ్చారు.

సామాజిక మాధ్యమాల్లో అభ్యంతకర మరియు అసభ్యకర పోస్టులు పెడుతున్న వారి వివరముల డేటాబేసు ను ప్రతీ జిల్లాలో తప్పనిసరిగా నిర్వహించాలని దేశించారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఈ విధంగా సామాజిక మాధ్యమాల్లో అభ్యంతకర పోస్టులు పెట్టిన వ్యక్తుల పైన ఇప్పటికే 134 కేసులు నమోదు చేయగా 106 మందిని అరెస్ట్ చేశామని ,57 కేసులలో చార్టి షీట్ లు దాఖలు చేయగా 25 కేసులు లో విచారణ ప్రారంభమైందని అన్నారు.

డిఎస్పీ లు వారి పరిధిలో గల పోలీస్ స్టేషన్ లో నమోదైన సోషల్ మీడియా కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి పర్యవేక్షణ లో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని సూచించారు.

విచారణ లో ఉన్న కేసులలో త్వరితగతిన విచారణ జరిగేట్లు పర్యవేక్షించాల్సిందిగా జిల్లా ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చారు.సామాజిక మాధ్యమాల్లో అభ్యంతకర, అసభ్య పోస్ట్ లు పెడుతూ, అనైతిక అసాంఘిక పనులు చేస్తున్న వ్యక్తులు చట్టం నుండి ఏ విధముగానూ తప్పించుకోలేరని గుర్తుంచుకోవాలని డీఐజీ గోపీనాథ్ జట్టి హెచ్చరించారు.

సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర, అసభ్య పోస్టుల నియంత్రణ - Tholi Paluku