
సాంకేతిక లోపంతో విజయవాడ-విశాఖపట్నం ఎయిర్ ఇండియా విమానం రద్దు
గన్నవరం నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపం కారణంగా గురువారం రద్దయింది. రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఇంజిన్‌లో సమస్య ఉన్నట్లు గుర్తించిన పైలట్లు వెంటనే విమానాన్ని నిలిపివేసి తిరిగి బే వద్దకు తీసుకువచ్చారు. భద్రతా పరమైన కారణాలతో అనంతరం విమానాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ విమానంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బి. సత్యనారాయణ సహా పలువురు ప్రయాణికులు విశాఖకు వెళ్లాల్సి ఉంది. విమానం రద్దుకావడంతో అందరూ తమ ప్రయాణాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. సాంకేతిక లోపం నేపథ్యంలో వెంకయ్య నాయుడు విశాఖ ప్రయాణాన్ని రద్దు చేసుకుని అనంతరం ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్ట్‌కు వెళ్లారు.
మరోవైపు విజయవాడ విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో ట్యాక్సింగ్ సమయంలోనే ఇంజిన్‌లో సమస్య తలెత్తినట్లు వెల్లడించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని సురక్షితంగా నిలిపివేశారని తెలిపారు.
ఇదే విషయంపై ఎయిర్ ఇండియా ప్రతినిధి స్పందిస్తూ విమానం బయలుదేరే ముందు పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించారని చెప్పారు. ప్రయాణికుల భద్రతే ప్రధానమని అందుకే విమానాన్ని రద్దు చేయాల్సి వచ్చిందని వివరించారు.
విమాన రద్దుతో ఇబ్బంది పడిన ప్రయాణికులకు హోటల్ వసతి కల్పించడంతో పాటు పూర్తి రీఫండ్ లేదా అదనపు ఛార్జీలు లేకుండా టికెట్లను మళ్లీ బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ అన్ని కార్యకలాపాల్లో భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇస్తామని సంస్థ స్పష్టం చేసింది.
