Let's talk: editor@tmv.in
సుస్థిర వ్యాపారాలే మేలు: నవీన్ పట్నాయక్

సుస్థిర వ్యాపారాలే మేలు: నవీన్ పట్నాయక్

Pinjari Chand
26 సెప్టెంబర్, 2025

సముద్రాలపై సుస్థిరమైన వ్యాపారాలను కొనసాగించాలని, సముద్రంపై వ్యాపారం చేయడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని ఒడిశా మాజీ సీఎం న‌వీన్ పట్నాయ‌క్ అన్నారు. గురువారం ప్ర‌పంచ స‌ముద్ర దినోత్సవం సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు. శ‌తాబ్దాలుగా క‌ళింగ నుంచి నావికుల ద్వారా వ్యాపారం జ‌రిగిందని, ప్ర‌తిభావంతులైన నావికుల వ‌ల‌న క‌ళింగా ప్రాంతం ప్ర‌పంచంలో తూర్పు దేశాల‌కు కిటీకిగా ఉండింద‌ని గుర్తు చేశారు. ఇక్క‌డి వారు సుదూర దేశాల‌తో వ్యాపారం చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. అందుకు వివిధ దేశాల‌కు ప్ర‌యాణం చేశార‌ని కొనియాడారు. ఈ సంద‌ర్భంగా రైల్ ఆధారిత మొబైల్ లాంచర్ సిస్టమ్ నుంచి ఇంటర్మీడియట్ రేంజ్ అగ్ని-ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు డీఆర్‌డీవో స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్‌, సాయుధ దళాలకు ప‌ట్నాయ‌క్ అభినందనలు తెలిపారు.

అదేవిధంగా కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఇండియ‌న్ షిప్పింగ్ సామ‌ర్థ్యాన్ని అభివృద్ధి చేయ‌డానికి సుమారు రూ. 69,725 కోట్లు మంజూరు చేసింది. దీంతో ప్ర‌పంచ వాణిజ్యంలో ఇండియా ముంద‌డుగు వేయ‌డానికి ఆస్కారం ఉంటుందని, యువ‌త‌కు కూడా ఉద్యోగావ‌క‌శాలు దొరుకుతాయ‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. దీని పై ప్ర‌ధాని మోడీ కూడా స్పందించార‌ని తెలిపారు.

సుస్థిర వ్యాపారాలే మేలు: నవీన్ పట్నాయక్ - Tholi Paluku