
సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించారు: సీజేఐ
సోషల్ మీడియాలో తాను ఖజురహో ఆలయంపై చేసిన వ్యాఖ్యలను కొంతమంది తప్పుదోవ పట్టించారని, నేను అన్ని మతాలను గౌరవిస్తానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ తెలిపారు. విగ్రహ పున:ప్రతిష్టాపనకు యూనెస్కో, ఇండియన్ పురావస్తు శాఖ నుంచి అనుమతులు అవసరమని తెలిపారు.
అసలు వివాదమేమిటంటే
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ది చెందిన ఖజురహోని జవారీ ఆలయంలో విష్ణువు విగ్రహం డ్యామేజీ అయిందని దాని స్థానంలో మరొకటి ప్రతిష్టించేలా ఆదేశాలు ఇవ్వాలని రాకేశ్ దలాల్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ సందర్బంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రతో కూడిన బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్ మాట్లాడుతూ ‘ఏదైనా చేయమని ఆ దేవుడినే అడగండి.ప్రార్థనలు, పూజలు చేయండి అని వ్యాఖ్యానించినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో మమ్మల్ని అవమానించారని ఆయన ఆరోపణలు చేశారు. అయితే సీజేఐ స్పందిస్తూ కొత్త విగ్రహ ప్రతిష్టాపనకు పరావస్తు శాఖ అనుమతి అవసరమని చెప్పానని, చాలా సమస్యలు ఉన్నాయని తెలిపానని అన్నారు. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగిందని వాపోయారు.
