Let's talk: editor@tmv.in
సర్దార్ చొరవను తెలంగాణ మరువదు: రాజ్ నాథ్ సింగ్

సర్దార్ చొరవను తెలంగాణ మరువదు: రాజ్ నాథ్ సింగ్

T Venkata Ramana
18 సెప్టెంబర్, 2025

రజాకార్ల ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు. పటేల్ సమర్థత వల్ల హైదరాబాద్ రాజ్యం భారత్ లో కలిసిందని, ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో గొప్ప ఘట్టం అని కొనియాడారు. సర్దార్ పటేల్ ముందు నిజాం తన ఓటమిని ఒప్పుకున్నారని, ఆపరేషన్ పోలో సర్దార్ పటేల్ ఎంతో ముందుచూపుతో వ్యవహరించారని ప్రశంసించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధర్మమార్గంలోనే నడుస్తామని, జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పి కొట్టాలని రాజ్ నాథ్ సింగ్ సూచించారు.

భారత్ సాదాసీదా దేశం కాదు

నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారని, వారి ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సమర్థత వల్ల హైదరాబాద్ రాజ్యం భారత్లో కలిసిందని, ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో గొప్ప ఘట్టమన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధర్మ మార్గంలోనే నడుస్తామని, జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలన్నారు. పటేల్ కలలుగన్న దేశాన్ని నిర్మించేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకొంటున్నారని, ఆర్టికల్ 370ని తొలగించి జమ్మూకశ్మీర్ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మనలో ఎన్ని విభేదాలున్నా దేశం విషయంలో అందరిదీ ఒకటే మాట. దేశ రక్షణ, భద్రత విషయంలో ప్రజలమంతా ఏకతాటిపైకి వస్తామని వివరించారు. ఇవాళ భారత్ అంటే సాదాసీదా దేశం కాదు. ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటున్నాం.

ఆపరేషన్ కొనసాగుతుంది

ఆపరేషన్ సిందూర్లో మన సైనికులు సత్తా చాటారని, ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబ సభ్యులను హతమార్చారని చెప్పారు. పహల్గాంలో మతం పేరు అడిగి మరీ చంపిన వారికి బుద్ధి చెప్పాం. ఆపరేషన్ సిందూర్లో భారత శక్తిసామర్థ్యాలు, సైనిక సత్తాను ప్రపంచం చూసింది. ఉగ్రవాదుల స్థావరాల్లోకి వెళ్లి మరీ వారిని హతమార్చాం. ఆపరేషన్ సింధూర్ ముగియలేదు. ఇప్పుడు చిన్న పాజ్ మాత్రమే. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది’’ అని రాజ్నాథ్ అన్నారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్, షెకావత్, మాజీ గవర్నర్ దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.

సర్దార్ చొరవను తెలంగాణ మరువదు: రాజ్ నాథ్ సింగ్ - Tholi Paluku