Let's talk: editor@tmv.in
సిమెంటుపై పన్ను తగ్గింపుతో ప్రజలకు ఊరట

సిమెంటుపై పన్ను తగ్గింపుతో ప్రజలకు ఊరట

Gaddamidi Naveen
23 సెప్టెంబర్, 2025

దేశ ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో సిమెంటుపై జీఎస్టీ తగ్గింపు ఒకటి. ఇప్పటివరకు సిమెంటుపై 28 శాతం వరకు జీఎస్టీ పన్ను భారం ఉండగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం దాన్ని 18 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం ద్వారా నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించడమే కాక, మధ్యతరగతి, పేద ప్రజలకు ఊరటనిస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఇల్లు నిర్మాణ ఖర్చులు తగ్గుతాయి

ఇల్లు నిర్మించడంలో సిమెంట్ కీలకమైన ముడి పదార్థం. దీని ధర నిర్మాణ వ్యయంలో ప్రధాన భాగాన్ని ఆక్రమిస్తుంది. సిమెంటుపై పన్ను తగ్గించడంతో ఒక్కో సంచిపై రూ. 40-50 వరకు ధర తగ్గే అవకాశం ఉంది. అంటే, ఒక సాధారణ ఇండివిడ్యువల్ ఇంటి నిర్మాణానికి ఉపయోగించే సిమెంట్ ఖర్చులో లక్ష రూపాయల వరకు పొదుపు చేయవచ్చు.ఇది ప్రత్యేకంగా పేద, మద్యతరగతి వర్గాలకు చాలా ఉపయోగకరమైనదిగా మారుతుంది.

ప్రయోజనం పొందనున్న తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తున్న ప్రజలకు కొంతమేరకు ఖర్చులు తగ్గుతుందని చెప్పవచ్చు, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇసుక ఉచితంగా అదిస్తుంది. ప్ర‌భుత్వ‌లు తీసుకున్న నిర్ణ‌యంతో మ‌ధ్య‌త‌ర‌గ‌తి, పేద ప్ర‌జ‌ల సొంత ఇంటి కళ నేర‌వేరుతుంది. సిమెంట్ ధర తగ్గడం వల్ల ఈ ప్రాజెక్టులకు కూడ ఖర్చులు తగ్గి, ప్రభుత్వం మరిన్ని ఇళ్లు వేగంగా నిర్మించే అవకాశం ఉంది. అలాగే గ్రామ పరిధిలో, మున్సిపల్ కార్పొరేషన్లలో నిర్వహించే అభివృద్ధి పనులకు ఇది సానుకూల ప్రభావం చూపుతుంది. ఇదే సమయంలో, ప్రైవేట్ రియల్ ఎస్టేట్ రంగనికి కూడా ఖ‌ర్చులు త‌గ్గుతాయి. ఇప్పుడు ఫ్లాట్లు కొనుగోలు చేయాలనుకునే వారికీ ధరలు కొంత మేర తగ్గే అవకాశం ఉంది. దీంతో హౌసింగ్ మార్కెట్ డిమాండ్ పెరిగి, ఆర్థికంగా మెరుగవుతుంది.

ఉద్యోగావకాశాల క‌ల్ప‌న‌,

నిర్మాణ రంగం అనేది అత్యధికంగా మనుషుల శ్రమపై ఆధారపడే రంగం. ఒక ప్రాజెక్ట్ ప్రారంభమైతే దానితోపాటు కార్మికులు, డ్రైవర్లు, సప్లయర్‌లు, డెలివరీ ఏజెంట్లు ఇలా అనేక రంగాలవారికి ఉపాధి కలుగుతుంది. సిమెంట్ పన్ను తగ్గింపుతో కొత్తగా నిర్మాణాలు మొదలయ్యే అవకాశం ఉంది.నిర్మాణాలు పెరగడం వల్ల ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశముంది.

ప్రభుత్వానికి దీర్ఘకాల ప్రయోజనం

ఇప్పటి వరకూ 29శాతం పన్నుతో ప్రభుత్వానికి అధిక ఆదాయం వ‌చ్చేది. అయితే దీన్ని 18శాతం కు తగ్గించడం ద్వారా, తాత్కాలికంగా పన్ను ఆదాయంలో కొంత కోత తప్పదు. కానీ, దీని వల్ల ప్రజలు ఇంటి నిర్మాణంపై మళ్ళీ ఆసక్తి చూపిస్తే, బహుళ మార్గాల ద్వారా పన్ను ఆదాయం తిరిగి ప్ర‌భుత్వ‌నికి చేరుతుంది. గృహ రిజిస్ట్రేషన్లు, ఇతర నిర్మాణ సంబంధిత సేవలపై వచ్చే పన్నులు పెరగవచ్చు. అలాగే, సిమెంట్ తయారీ పరిశ్రమకు డిమాండ్ పెరిగి, ఆ పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయాలు కూడా పెరిగే అవకాశం ఉంది.

సిమెంటుపై పన్ను తగ్గింపుతోపాటు, ఇతర నిర్మాణ పదార్థాలపై కూడా పన్ను తగ్గింపు లాంటి నిర్ణయాలు తీసుకుంటే, గృహ నిర్మాణ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఇనుము, స్టీల్, సానిటరీ, టైల్స్ వంటి అంశాల్లోనూ పన్నుల సిమెంటుపై పన్ను తగ్గింపుతోపాటు, ఇతర నిర్మాణ పదార్థాలపై కూడా పన్ను తగ్గింపు లాంటి నిర్ణయాలు తీసుకుంటే, గృహ నిర్మాణ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఇనుము, స్టీల్, సానిటరీ, టైల్స్ వంటి అంశాల్లోనూ పన్నుల భారం త‌గ్గించాల‌సిన అవ‌స‌రం ఉంది. సిమెంటుపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వ‌ల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక బలమైనదిగా అవుతుంది. ప్రజలు, నిర్మాణ రంగం, ప్రభుత్వం అన్నివర్గాలకు దీర్ఘకాల ప్రయోజనాలు కలిగిస్తుందని చెప్పొచ్చు.

సిమెంటుపై పన్ను తగ్గింపుతో ప్రజలకు ఊరట - Tholi Paluku