
సెప్టెంబర్ 30న ‘మేరా దేశ్ పహలే’ ప్రదర్శన
ప్రధాని నరేంద్ర మోడీ జీవితంలోని కొన్ని ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన ’మేరా దేశ్ పహలే’ను సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ప్రదర్శించబోతున్నారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసింది. ఈ డాక్యుమెంటరీ ఆధారంగా మోడీ జీవితంలో ఎవరికీ తెలియని అనేక విశేషాలను తెరమీదకు తీసుకురాబోతున్నారు. ‘ఇది ఒక సాధారణ వ్యక్తి నుంచి ప్రధాని పదవిని అధిరోహించిన నేత ప్రయాణాన్ని తెలియజేసే చిత్రం. ఆత్మవిశ్వాసం, దేశభక్తి, ప్రజలపట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబించే విశిష్ట కథనం.’ అని బీజేపీ పేర్కొన్నది.
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో సెప్టెంబర్ 30న(మంగళవారం) సాయంత్రం 5 గంటలకు ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితమని నిర్వాహకులు తెలిపారు. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన క్యూఆర్ కోడ్ ఆధారంగా ఈ డాక్యుమెంటరీని వీక్షించవచ్చని వారు తెలిపారు. యువత, విద్యార్థులు, సమాజసేవకులు, రాజకీయ నాయకులు తప్పకుండా హాజరై ఒక గొప్ప నాయకుడికి సంబంధించిన జీవిత విశేషాలను తెలుసుకోవాలని బీజేపీ తెలిపింది. ప్రఖ్యాత రచయిత, మనోజ్ ముంతాషిర్ ఈ చిత్రాన్ని సమర్పించనున్నారు. మోడీ రాజకీయ, సామాజిక, సానుకూల ప్రభావం, ఎప్పటికీ వినిపించని, తెలియని ఘట్టాలను ఈ ప్రదర్శన వెలుగులోకి తెస్తుంది. ప్రతి భారతీయుడు చూసి గర్వపడేలా, ప్రేరణ పొందేలా రూపొందించబడిన ఈ ప్రదర్శనలో విజువల్స్, కథనశైలి, సాంకేతిక నైపుణ్యం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
