
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్, ఆస్ట్రేలియా దిగ్గజం ప్యాట్ కమిన్స్ వెన్నునొప్పి కారణంగా టోర్నీలోని మొదటి కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. 2025-26 యాషెస్ సిరీస్ సమయంలో తలెత్తిన ఈ గాయం కారణంగా ఆయన ఇప్పటికే కీలకమైన టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యారు. కమిన్స్ కోలుకునే వరకు జట్టు బాధ్యతలను స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు అప్పగిస్తున్నట్లు ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం స్పష్టం చేసింది. యువ సంచలనం అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
ఫామ్‌లో ఇషాన్.. కెప్టెన్‌గా సరికొత్త సవాల్
గత సీజన్‌లో రూ.14.5 కోట్లకు జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్, అరంగేట్రం మ్యాచ్‌లోనే రాజస్థాన్ రాయల్స్‌పై 45 బంతుల్లోనే మెరుపు సెంచరీ బాది సంచలనం సృష్టించారు. గతేడాది జార్ఖండ్ జట్టును సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా నిలపడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ టోర్నీలో 517 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఇషాన్, ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ 317 పరుగులతో భారత్ టైటిల్ డిఫెన్స్‌లో రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచారు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా కమిన్స్ లేని లోటును ఇషాన్ తన బ్యాటింగ్‌తో, సారథ్యంతో భర్తీ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
పటిష్టంగా సన్‌రైజర్స్ దళం
2026 సీజన్ కోసం హైదరాబాద్ జట్టు సమతూకంతో కనిపిస్తోంది. ట్రావిస్ హెడ్, క్లాసెన్, లివింగ్‌స్టన్ వంటి అంతర్జాతీయ స్టార్లతో పాటు నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్ వంటి అనుభవజ్ఞులైన స్వదేశీ ఆటగాళ్లతో జట్టు పటిష్టంగా ఉంది. కమిన్స్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూనే, ఇషాన్ సారథ్యంలో ఈసారి కప్పు కొట్టాలని ఆరెంజ్ ఆర్మీ పట్టుదలతో ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు
సలిల్ అరోరా, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, రవిచంద్రన్ స్మరణ్, అనికేత్ వర్మ, అభిషేక్ శర్మ, బ్రైడన్ కార్సే, హర్ష్ దూబే, జాక్ ఎడ్వర్డ్స్, లియామ్ లివింగ్‌స్టన్, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, శివం మావి, పాట్ కమిన్స్, అమిత్ కుమార్, క్రైన్స్ ఫులెత్రా, ప్రఫుల్ హింగే, ఈషన్ మలింగ, హర్షల్ పటేల్, సాకిబ్ హుస్సేన్, శివాంగ్ కుమార్, ఓంకార్ తర్మలే, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ.
