Let's talk: editor@tmv.in
స్నేహితుడి ముందే గ్యాంగ్ రేప్

స్నేహితుడి ముందే గ్యాంగ్ రేప్

Pinjari Chand
17 సెప్టెంబర్, 2025

ఒడిశా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. పూరీలోని బలిహరచండి ఆలయం సమీపంలో ఓ విద్యార్థినిని ముగ్గురు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ జంట బలిహరచండి ఆలయానికి దైవదర్శనానికి వెళ్లి అటునుంచి దగ్గరలోనే ఉన్న సరుగుడు అడవిలోకి ప్రకతి అందాలను ఆస్వాదించడానికి వెళ్లింది. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు వారిని అనుసరిస్తూ వారిని ఫోటోలు, వీడియోలు తీశారు. ఆ వీడియోలను, ఫోటోలను చూపించి డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశారు. వారి వద్ద ఉన్న డబ్బులు ఇచ్చిన తరువాత విద్యార్థినితోపాటు వచ్చిన ఫ్రెండ్ ను తీవ్రంగా కొట్టి ఆ విద్యార్థినిని పక్కకు తీసుకుపోయి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.

19 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనలో మరింత మంది ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కేసును ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తామని పూరీ ఎస్పీ ప్రతీక్ సింగ్ వివరించారు. గతంలో ఈ ఏడాది జూన్ 15 న గంజాం జిల్లాలోని గోపాలపూర్ బీచ్ లో కూడా ప్లస్ 3 చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. అయితే ఈ సంఘటన నాడు దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తించింది. ఆ విద్యార్థిని స్నేహితుడిపై దాదాపు 10 మంది దాడిచేశారు.

స్నేహితుడి ముందే గ్యాంగ్ రేప్ - Tholi Paluku