
సనత్‌నగర్ పారిశ్రామిక ప్రాంతంలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఇండియన్ కంటైనర్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాంగణంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం సుమారు 8.40 గంటల సమయంలో చెలరేగిన మంటలు కొద్ది సేపట్లోనే ఫ్యాక్టరీ గోడౌన్ అంతా వ్యాపించాయి.
తొమ్మిది ఫైర్ ఇంజన్లు రంగంలోకి
ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులు, స్థానికులు మంటలను గమనించి వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో వెంటనే స్పందించిన అధికారులు తొమ్మిది ఫైర్ ఇంజన్లులను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తెచ్చారు. సంతోషించాల్సిన విషయం ఏంటంటే అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే గిడ్డంగిలో నిల్వ ఉంచిన కొన్ని కంటైనర్లు, రవాణా సామగ్రి, ఎలక్ట్రికల్ పరికరాలు కాలిపోయినట్లు సమాచారం.
ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాథమిక ఈ అగ్నిప్రమాదం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల అసలు కారణం తెలియాల్సి ఉంది.
