Let's talk: editor@tmv.in
సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణంలో ప్రమాదం.. ముగ్గురు మృతి

సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణంలో ప్రమాదం.. ముగ్గురు మృతి

Gaddamidi Naveen
25 నవంబర్, 2025

నగరంలోని సనత్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రి ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరమ్మతు నిర్మాణ పనుల సమయంలో శ్లాబ్‌ పెచ్చులు మీద పడడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మ‌రో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణ స్థలంలో జరిగింది.ఐదుగురు నిర్మాణ కార్మికులు ఉన్నారని పోలీసు అధికారి తెలిపారు.గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉన్నప్పటికీ, ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.

సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణంలో ప్రమాదం.. ముగ్గురు మృతి - Tholi Paluku