Let's talk: editor@tmv.in
స్థానిక ఎన్నికల ముందే కులగణన వివరాలు ప్రకటించాలి: కవిత‌

స్థానిక ఎన్నికల ముందే కులగణన వివరాలు ప్రకటించాలి: కవిత‌

T Venkata Ramana
24 సెప్టెంబర్, 2025

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక ఆరోపణలు చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, రాష్ట్రంలోని. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలను ప్రకటించడానికి ముందే, రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వే వివరాలను ప్రతి గ్రామ పంచాయతీ వారీగా బయటపెట్టాలని ఆమె మంగళవారం డిమాండ్ చేశారు. కులగణన సర్వే వివరాలను రహస్యంగా ఉంచి, బీసీ రిజర్వేషన్లను తమకు అనుకూలంగా ఖరారు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలమైన ప్రాంతాల్లో రిజర్వేషన్లు ఖరారు చేసుకునేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ఆమె విమర్శించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం హడావుడిగా ఎన్నికలు నిర్వహిస్తే బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కవిత హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలను ప్రకటించేలోపే కులగణన వివరాలను బహిర్గతం చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆమె అన్నారు.

చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం

"బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు తెలంగాణ జాగృతి మొదటి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తోంది. రిజర్వేషన్లు పెరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది" అని కవిత తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న కారణంతో బీఆర్ఎస్ అధినేత, ఆమె తండ్రి కేసీఆర్‌ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత, తెలంగాణ జాగృతి కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. కులగణన సర్వే వివరాలు బయటపెట్టకుండా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ కుట్ర కనపడుతోందని ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్న చోట రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ప్రకటించేలోపే కుల గణన సర్వే వివరాలు వెల్లడించి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. హడావిడిగా ఎన్నికలు నిర్వహించి రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తే బీసీలకు అన్యాయం చేసినట్లేనన్నారు.

స్థానిక ఎన్నికల ముందే కులగణన వివరాలు ప్రకటించాలి: కవిత‌ - Tholi Paluku