Let's talk: editor@tmv.in
స్టేడియం లో పిడుగు పడి కార్మికుడు మృతి

స్టేడియం లో పిడుగు పడి కార్మికుడు మృతి

FL - YUGDR
23 సెప్టెంబర్, 2025

విశాఖపట్నం కొమ్మది గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియం వద్ద సోమవారం ఉదయంపిడుగు పడి ప్రమాదం జరిగింది. విశాఖ తూర్పు ఆరిలోవ నెహ్రు నగర్ కి చెందిన ఆఫీస్ సబార్డినేటర్ ఉద్యోగిగా పనిచేస్తున్న దోహర్తి సూర్య ప్రకాష్ ( 37) అక్కడికక్కడే మృతి చెందాడు . ఆయనకు భార్య ఆశ (32) పిల్లలు తేజశ్రీ (12) సోమేశ్వరి (4) వున్నారు. దోహార్తి సూర్య ప్రకాష్ విశాఖ జిల్లా, ఆరిలోవ ప్రాంతానికి చెందినవాడు అని గుర్తించారు సంఘటనపై సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు . పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి దర్యాప్తు ప్రారంభించారు.

స్టేడియం లో పిడుగు పడి కార్మికుడు మృతి - Tholi Paluku