Let's talk: editor@tmv.in
సచివాలయంలో హెల్త్ క్యాంప్‌‌ను ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్

సచివాలయంలో హెల్త్ క్యాంప్‌‌ను ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్

Gaddamidi Naveen
20 నవంబర్, 2025

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, మూడవ అంతస్థులో ఏఐ ఆధారిత మెగా కార్డియాక్ హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించారు.సచివాలయ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం రేనోవా ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.

ఈ హెల్త్ క్యాంప్‌లో సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చిన ఉద్యోగులకు రేనోవా హాస్పిటల్ వైద్య సిబ్బంది సేవలు అందించారు.వైద్య సిబ్బంది అత్యాధునిక పరికరాల సాయంతో బీపీ, జీఆర్బీఎస్, ఈసీజీ, 2డీ ఎకో వంటి కీలక పరీక్షలను ఉచితంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా మాట్లాడుతూ, ప్రస్తుతం వేగంగా మారుతున్న జీవన శైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ప్రతి ఉద్యోగికి అత్యంత అవసరమని సూచించారు.ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా అందించాలంటే ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అని మంత్రి తెలిపారు. ఈ దిశగా వివిధ శాఖల ఉద్యోగుల కోసం మరిన్ని హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించినట్లు మంత్రి తెలిపారు.

సచివాలయ ఉద్యోగుల కోసం అత్యాధునిక కార్డియాక్ స్క్రీనింగ్ సేవలను ఉచితంగా అందించిన రేనోవా ఆసుపత్రి వైద్యసిబ్బందిని మంత్రి అభినందించారు.ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని మంత్రి సూచించారు. సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయడం పట్ల కూడా మంత్రి ప్రశంసలు తెలిపారు.ఈ చొరవ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తుంది.