
సాగర్ తీరాన, అత్యంత అట్టహాసంగా
యువత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కెటిఎమ్ డ్యూక్ 160 మోడ్రన్ బైక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. విశాఖ సాగర్ తీరాన వేలాదిమంది యువత సమక్షంలో వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్ ఆదివారం సాయంత్రం ఈ బైక్ ను ఆవిష్కరించారు. అత్యంత అట్టహాసంగా జరిగిన ఈ బైక్ లాంచింగ్ మెగా ఈవెంట్లో కైరోస్ రాక్ బ్యాండ్ అందరినీ అలరించింది. యాంకర్ హారిక వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో మెంటలిస్ట్ సుదర్శన్ చేసిన ప్రదర్శన అందర్నీ అమితంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి ప్రభు కిషోర్ మాట్లాడుతూ విశాఖ యువతకు దసరా కానుకగా ఈ కెటిఎమ్ డ్యూక్ 160 బైకును అందుబాటులోకి తెస్తున్నామన్నారు.
ఈ మోడరన్ బైక్ ను ఎంత స్టైలిష్ గా నడుపుతున్నామో, అంతే భద్రతా ప్రమాణాలను పాటించడం ముఖ్యమని యువతకు సూచించారు.30 ఏళ్లుగా వాహనచోదుకుల ఆదరాభిమానాలతో ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న వరుణ్ మోటార్స్ దినదిన ప్రవర్తమానంగా వెలుగొందుతోందని అన్నారు. అనంతరం కెటిఎమ్ ప్రో బైక్స్ సౌత్ సేల్స్ హెడ్ కార్తీక్ మాట్లాడుతూ డ్యూక్ బైక్ మునుపటి మాదిరిగానే ఈ మోడల్ కూడా అత్యంత ఆదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత ఆశలకు అనుగుణంగా ఈ బైక్ ను రూపొందించామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా మిస్ క్వీన్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ విన్నర్ పూజిత తో పాటు పలువురు మోడళ్లు చేసిన ఫ్యాషన్ షో అందరినీ ఆదరించింది. ప్రముఖ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ రేస్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత దాడి రవికుమార్ సారధ్యంలో జరిగిన ఈ మెగా ఈవెంట్ లో ప్రో బైక్స్ ఆంధ్ర రీజినల్ హెడ్ హరీష్, వరుణ్ బజాజ్ సీఈవో ఆడారి శ్రీనివాస్, కెటిఎమ్ షోరూoల నార్త్ ఆంధ్ర జిఎం సురేష్ తదితరులు పాల్గొన్నారు.
