Let's talk: editor@tmv.in
స్కానింగ్ రూమ్ల.. అరాచకం

స్కానింగ్ రూమ్ల.. అరాచకం

Panthagani Anusha
18 సెప్టెంబర్, 2025

మహిళా భద్రత, వారి సంరక్షణకై ఎన్నో సంఘాలు, షీ టీమ్స్ మరిన్ని బలగాలు ఆడవారి రక్షణకి ఎంతో కృషి చేస్తున్నప్పటికీ వారిపై వేధింపులు తప్పడం లేదు, ఇటీవల కాలంలో ఎటువంటి సంఘటనలు తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే ఇలాంటి ఒక సంఘటననే భద్రాచలం పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ చోటుచేసుకుంది. తాజాగా, ఒరిస్సా రాష్ట్రం నుండి భద్రాచలానికి వైద్యసేవలకు వచ్చిన మధుమిత అనే మహిళ ఈ సమస్యను ప్రత్యక్షంగా అనుభవించింది.

డాక్టర్ సూచన మేరకు బ్లడ్ శాంపిల్స్, స్కానింగ్ కోసం రూమ్లోకి వెళ్లిన ఆమెకు అక్కడి ల్యాబ్ టెక్నీషియన్ శంకర్ మద్యం మత్తులో ఉండి మధుమిత పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. భయంతో, మధుమిత గట్టిగా అరుస్తూ వెంటనే బయటకు పరుగులు తీసింది. కాగా జరిగిన విషయాన్ని ఆమె హాస్పిటల్ నిర్వాహకులకు తెలియజేశప్పటికీ, ఎవరూ తగిన చర్యలు తీసుకోలేదు. దీంతో హాస్పిటల్ నిర్వాకుల నిర్లక్ష్యానికి విసిగిపోయి బాధితురాలు భద్రాచలం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి వాగ్మూలం ఆధారంగా ల్యాబ్ టెక్నీషియన్పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.

అయితే విచారణలో భాగంగా హాస్పిటల్ సిబ్బందిపై అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ పై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాయి, భద్రాచలం పట్టణంలో తరచూ వివాదాలకు కేంద్రంగా మారే ఈ ఆసుపత్రి రోగులపై అమానుషమైన ప్రవర్తన, సేవల లోపం కారణంగా స్థానికుల నిరసనలకు కారణమవుతోంది. అంతేకాక రోగులను ఖమ్మం, హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు తరలించడం, చివరి క్షణంలో సేవల లోపం, అసభ్య ప్రవర్తన లాంటి సమస్యలు ఈ ఆసుపత్రిలో సాధారణమని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. అధికారులు ఇప్పటివరకు దృష్టి పెట్టకపోవడం వల్ల రోగులు వారి కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసహనం వ్యక్తం చేశారు.

స్కానింగ్ రూమ్ల.. అరాచకం - Tholi Paluku