
సంగారెడ్డి నుంచి రిజిస్ట్రార్ కార్యాలయాలను తరలిస్తే ఊరుకునేది లేదు: జగ్గారెడ్డి
Gaddamidi Naveen
28 జనవరి, 2026
సంగారెడ్డి జిల్లా పట్టణ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రస్తుత ప్రాంతం నుంచి తరలించాలనే ప్రతిపాదనలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యవహారానికి సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులపై ఆయన మండిపడ్డారు. అక్కడి రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ‘ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం’ పేరుతో పఠాన్‌చెరు నియోజకవర్గం కర్ధనూర్‌కు తరలించాలని నిర్ణయించినట్లు సమాచారం.దీనిని జగ్గారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో తాను మాట్లాడేవరకు తరలింపు ఆలోచన చేయొద్దన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఇది తన సూచన.. హెచ్చరిక అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
