
శ్రీశైలం లో మ్యూజియం ఏర్పాటుకు ఆలోచన
ప్రధాని కర్నూలు రాకతో తెరమీదకు వచ్చిన మ్యూజియం ఆలోచన..శతాబ్దాల చరిత్రను భక్తులు తెలుసుకునేందుకు శ్రీశైలం లో పురావస్తు మ్యూజియం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చాలా కాలం నాటిది. నిధుల కొరతతో ఆ ప్రతిపాదన కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. శ్రీశైలం దాని పరిసర ప్రాంతాలలో లభించిన తామ్ర, శిలాశాసనాలతో మ్యూజియం ఏర్పాటు చేస్తే బావితరాలకు చరిత్ర ఆనవాళ్ళు తెలుసుకునే అవకాశం వస్తుందని భారత పురావస్తు శాఖ సంచాలకులు మునిరత్నం రెడ్డి అన్నారు. ఆయన శ్రీశైలం లో లభించిన తామ్ర శాసనాల ఆధారంగా “శ్రీశైల నూతన తామ్ర శాసనాలు” అనే పేరుతో పుస్తకాన్ని రచించారు. దీన్ని ప్రధాని చేతులుమీదుగా ఆవిష్కరించనున్నారు. భారత పురావస్తు శాఖ ఆద్వర్యంలో కొన్నేళ్ళ కిందట ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేస్తుండగా లభించిన 21 సెట్ల తామ్రశాసనాలు,ఘంటామఠం లో బయటపడిన బంగారు,వెండి నాణాలు ,ఇతర వస్తువులు ప్రధాని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ప్రధాని మోడీ కి ఈ తామ్ర శాసనాల చరిత్రను మునిరత్నం రెడ్డి వివరించనున్నారు.ఈ సందర్బంగా మ్యూజియం ఏర్పాటుకు ఆయన ప్రధానితో చర్చించనున్నారు.
