Let's talk: editor@tmv.in
శిశు మరణాలు తగ్గాయి: కేరళ సీఎం

శిశు మరణాలు తగ్గాయి: కేరళ సీఎం

Pinjari Chand
16 అక్టోబర్, 2025

శిశు మరణ రేటు విషయంలో అమెరికా యునైటెడ్ స్టేట్స్‌ను కేరళలో మించిపోయిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వివరించారు. ఆయన ఇటీవల రాష్ట్రంలో ఆరోగ్య, అభివృద్ధి రంగాల్లో సాధించిన విజయాలను గురించి మాట్లాడారు. సామాజికంగా కేరళ సాధించిన పురోగతిని సమాజం సరిగ్గా గుర్తించలేదేమోనని అనుమానంగా ఉందన్నారు. కేరళ శిశు మరణాల రేటులో అమెరికాను అధిగమించిందన్నారు. కానీ ఈ విషయానికి అంత ప్రాముఖ్యత లభించలేదన్నది స్పష్టమవుతుంది. కొంతవరకు ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ విజయాలను దాచి ఉంచేందుకు ప్రయత్నించినందున రాష్ట్ర పురోగతిని తక్కువగా చేసి చూపడం సరైంది కాదన్నారు.

శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ స్టాటికల్ రిపోర్ట్ ప్రకారం కేరళలో శిశుమరణాలు వేయికి 5 శాతంలోపు ఉంది. అమెరికాలో సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) ప్రకారం 2024లో శిశుమరణాల రేటు 1,000 మంది జననాలకు 5.49 మరణాలు (లక్ష జననాలకు 549) గా నమోదైంది.

ఎల్డీఎప్​ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఆరోగ్యరంగంలో అనుహ్యమైన మార్పులు సాధించామన్నారు. ఈ సందర్భంగా ఆయన కేరళలో క్రమంగా జరిగిన అభివృద్ధిని గుర్తుచేశారు. ఆరోగ్య రంగంలో భారీ మార్పులు వచ్చాయని తెలిపారు. ఎల్‌డిఎఫ్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం నిరంతంర కృషి చేసిందన్నారు. 2011–2016 మధ్య ఆరోగ్య రంగం చాలా వెనుకబడి ఉన్నామన్నారు. నాటి యూడిఎఫ్ ప్రభుత్వం ఆరోగ్యశాఖను పట్టించుకోలేదని విమర్శించారు. 2016 తరువాత ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెనుమార్పలు వచ్చాయని ఉద్ఘాటించారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో కేరళ చూపిన విధానం ప్రపంచాన్ని ఆశ్చర్యపరచిందన్నారు.

శబరిమల బంగారం స్కాం విచారణ జరుగుతుందని ఈ వివాదంపై ప్రజలు అనవసరంగా ఊహించుకుని త్వరగా ఫలితాలు రావాలంటే వీలుకాదన్నారు. హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోందని తెలిపారు. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, విచారణ సక్రమంగా నడుస్తోందని వివరించారు. సంబంధిత నివేదిక వచ్చిన తరువాత తగిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. విచారణ పూర్తి కాకముందే తీర్పు చెప్పే ప్రయత్నాలు విరమించుకోవాలని ప్రజలను కోరారు.

కేరళలో శిశు మరణాల రేటును తగ్గించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. వాటిలో కొన్ని:

లక్ష్య కార్యక్రమం

ఇది ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో లేబర్ రూమ్స్, ఆపరేషన్ థియేటర్లు, మాతృ-శిశు సేవల ప్రాంతాలలో మెరుగైన సేవలు అందించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇందులో భాగంగా సరిపడిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం, మానవ వనరుల అందుబాటు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం. కాన్పు అయిన వెంటనే శిశు సంరక్షణ, సకాలంలో రిఫరల్ (తగ్గిన చికిత్స అవసరం అయితే) చేయడం.

జనని సురక్షా కార్యక్రమ్​

గర్భిణి మహిళలకు, జననానంతరం శిశువులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు, పరీక్షలు, మందులు, ట్రాన్స్‌పోర్ట్ వంటివి అందచేయడం.

ఆరోగ్య కిరణం స్కీం

1 నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లలకు ప్రభుత్వ ఆసుపత్రులలో ఇన్ పేషంట్,ఔట్ పేషంట్ డిపార్ట్​ మెంట్లలో ఉచిత చికిత్స అందించడం

హృదయం

పుట్టుకతో వచ్చిన హృదయ సంబంధిత వ్యాధులు ఉన్న శిశువులను తొందరగా గుర్తించి సకాలంలో చికిత్స అందించడం ఈ కార్యక్రమం ఉద్దేశం.

ముస్కాన్ సర్టిఫికేషన్

శిశు-మిత్ర ఆసుపత్రుల సేవల ప్రమాణాలను పెంచటం, బిడ్డల సంరక్షణ ( మాతా శిశు సంరక్షణా కేంద్రాలు, అప్పుడే పుట్టిన పిల్లలకు స్టెబిలైజేషన్ యూనిట్ల ఏర్పాటు వంటివి మెరుగుపరిచే ప్రోగ్రామ్స్. కోజికొడ్ మెడికల్ కాలేజీకి కి ముస్కాన్ సర్టిఫికేషన్ లభించింది.

నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్​ ప్రాసెస్

ప్రజా ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు తదితర సదుపాయాలపై జాతీయ స్థాయిలో క్వాలిటీ ఆష్యూరెన్స్ సర్టిఫికేషన్లు అందించడం. ఇది సేవా ప్రమాణాలు మెరుగుపరచడానికి ఉపయోగకరం.

ఆరాధిక (అవగాహన) కార్యక్రమాలు

ప్రారంభ సమయంలో తల్లికి వెంటనే బూత్ ఫీడింగ్ ప్రారంభించటం / మొదటి గంటలో బూత్-ఫీడింగ్ సంస్కరణలు

గర్భిణీ మహిళలలో అనీమియా, పోషకాహారం నిఘా, నవజాత శిశువుల మరణాల లెక్కలు తీయడం. శిశువుల మరణాలకు సంబంధించిన కారణాల పై విశ్లేషణ చేసి చర్యలు తీసుకోవడం.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వినియోగం పెంచడం

చిన్న గ్రామాల లోనూ వైద్య సదుపాయాలు మెరుగుపరచడం, రిఫరల్స్ సిస్టమ్ బలపరచడం. ఇలాంటి కార్యక్రమాల వల్ల కేరళ శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది.

శిశు మరణాలు తగ్గాయి: కేరళ సీఎం - Tholi Paluku