Let's talk: editor@tmv.in
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ అభ్యర్థిగా తూమాటి నామినేషన్‌

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ అభ్యర్థిగా తూమాటి నామినేషన్‌

Pinjari Chand
19 ఆగస్టు, 2026

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్‌ ఆశీస్సులు తీసుకున్నారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ అభ్యర్థిగా తూమాటి మాధవరావు పేరును వైఎస్‌ జగన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. తూమాటి మాధవరావు ఎన్నిక సాఫీగా జరిగేలా పార్టీ ఎమ్మెల్సీలంతా సమన్వయంతో పనిచేసి పూర్తి మద్దతు ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.