
శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు: ద.మ. రైల్వే
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి శబరిమల సమీప స్టేషన్ల వరకు మొత్తం 60 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు నవంబర్ 2025 నుండి జనవరి 2026 వరకు అంటే మండల పూజ, మకరజ్యోతి వరకు అందుబాటులో ఉంటాయి.
ఈ ప్రత్యేక రైళ్లు ప్రధానంగా హైదరాబాద్ ప్రాంతంలోని చర్లపల్లితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం, నర్సాపూర్ వంటి ప్రధాన కేంద్రాల నుంచి కేరళలోని ముఖ్యమైన కొల్లాం రైల్వే స్టేషన్ వరకు రాకపోకలు సాగించనున్నాయి.
చర్లపల్లి–కొల్లం–చర్లపల్లి (07107/07108):
ఈ రైళ్లు పగిడిపల్లి, గుంటూరు, గూడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తాయి. 07107 రైలు నవంబర్ 17, 24, డిసెంబర్ 1, 8, 15, 22, 29, జనవరి 5, 12, 19 తేదీల్లో (సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొల్లం చేరుకుంటుంది . 07108 రైలు నవంబర్ 19, 26, డిసెంబర్ 3, 10, 17, 24, 31, జనవరి 7, 14, 21 తేదీల్లో (బుధవారం) తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లం నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
నర్సాపూర్–కొల్లం–నర్సాపూర్ (07105/07106):
ఈ రైళ్లు విజయవాడ, గూడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తాయి. 07105 రైలు నవంబర్ 16, 23, 30, డిసెంబర్ 7, 14, 21, 28, జనవరి 4, 11, 18 తేదీల్లో (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు నర్సాపూర్ నుంచి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొల్లం చేరుకుంటుంది. 07106 రైలు నవంబర్ 18, 25, డిసెంబర్ 2, 16, 23, 30, జనవరి 6, 13, 20 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లం నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.
మచిలీపట్నం–కొల్లం–మచిలీపట్నం (07101/07102):
ఈ రైళ్లు గూడూరు, రేణిగుంట మీదుగా నడుస్తాయి . 07101 రైలు నవంబర్ 14, 21, 28, డిసెంబర్ 26, జనవరి 2 తేదీల్లో (శుక్రవారం) సాయంత్రం 4.30 గంటలకు మచిలీపట్నం నుంచి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొల్లం చేరుకుంటుంది. 07102 రైలు నవంబర్ 16, 23, 30, డిసెంబర్ 28, జనవరి 4 తేదీల్లో (ఆదివారం) తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లం నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.
మచిలీపట్నం–కొల్లం–మచిలీపట్నం (07103/07104):
ఈ రైళ్లు గుంటూరు, నంద్యాల, కడప, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తాయి. 07103 రైలు డిసెంబర్ 5, 12, 19, జనవరి 9, 16 తేదీల్లో (శుక్రవారం) ఉదయం 10 గంటలకు మచిలీపట్నం నుంచి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొల్లం చేరుకుంటుంది. 07104 రైలు డిసెంబర్ 7, 14, 21, జనవరి 11, 18 తేదీల్లో (ఆదివారం) తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లం నుంచి బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు ప్రధాన స్టేషన్ల వద్ద ఆగుతూ భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు వీలు కల్పిస్తాయి. సాధారణ శబరి ఎక్స్‌ప్రెస్ రైలులో ఇప్పటికే రిజర్వేషన్లు నిండిపోవడంతో, ఈ 60 ప్రత్యేక రైళ్లు అయ్యప్ప భక్తుల ప్రయాణ రద్దీని గణనీయంగా తగ్గించడంలో సహాయపడనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన టికెట్ రిజర్వేషన్లు శుక్రవారం ఉదయం నుంచే అందుబాటులోకి వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. భక్తులు అసౌకర్యాన్ని నివారించడానికి ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
