
వ్యాపారవేత్త సమీర్ మోడీపై చార్జ్‌షీట్
వ్యాపారవేత్త సమీర్ మోడీపై అత్యాచార ఆరోపణల కేసులో ఢిల్లీ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ చార్జ్‌షీట్‌ను సాకేత్ జిల్లా కోర్టులో సమర్పించినట్లు పోలీసులు ఢిల్లీ హైకోర్టుకు తెలియజేశారు.
న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీస్‌స్టేషన్‌లో అత్యాచారం, బెదిరింపు కేసులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం సమీర్ మోదీ బెయిల్‌పై ఉన్నారు. ఆయన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. నవంబర్ 11న జస్టిస్ సంజీవ్ నరులా ఎదుట విచారణ సందర్భంగా, పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. సమీర్ మోడీ తరఫు న్యాయవాది విక్రమ్ శర్మ వాదిస్తూ, విచారణాధికారి తమ సమర్పించిన పత్రాలను పరిగణనలోకి తీసుకోలేదని అభ్యంతరం తెలిపారు.
ప్రభుత్వ న్యాయవాది సంజయ్ లావో వివరణలో, ఆ పత్రాలు నవంబర్ 7 సాయంత్రం సమర్పించారని, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) 2023 సెక్షన్ 193(2) ప్రకారం 60 రోజుల లోపు చార్జ్‌షీట్ దాఖలు చేయాల్సిన నిబంధన ఉండటంతో, సమీక్ష లేకుండానే చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు చెప్పారు. అయితే, విచారణధికారి ఆ పత్రాలను పరిశీలించి సప్లిమెంటరీ చార్జ్‌షీట్ సమర్పించనున్నట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు.
సమీర్ మోడీని సెప్టెంబర్ 18న లండన్ నుంచి తిరిగి వచ్చినప్పుడు ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 25న సాకేత్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 5 లక్షల బాండ్, అదే మొత్తంలో షూరిటీ సమర్పించగా ఆయన విడుదలయ్యారు.
కేసు దశలో ఆయన న్యాయవాదులు ‘ఇద్దరి మధ్య సంబంధం పరస్పర సమ్మతితో సాగిందని, దానికి ఆధారాలు ఉన్నాయని" వాదించారు.
మహిళ ఫిర్యాదు వివరాలు
2019లో పరిచయం ఏర్పడి, వ్యాపార సహకారం పేరుతో సన్నిహిత సంబంధం ఏర్పడిందని, తర్వాత ఆయన బలవంతంగా ప్రవర్తించారని బాధితురాలు పేర్కొంది. తనకు హాని చేస్తానని బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొంది.
కేసు ప్రస్తుత స్థితి
చార్జ్‌షీట్ దాఖలు పూర్తయింది. సమీర్ మోడీ పక్షం సమర్పించిన పత్రాలను పోలీసులు సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో చేర్చనున్నారని హైకోర్టు రికార్డు చేసింది. విచారణ ఇంకా కొనసాగుతోంది. ఫైనల్ ట్రయల్ దశలో కోర్టు ఇరువైపుల ఆధారాలను పరిశీలించి తీర్పు ఇవ్వనుంది.
ఎవరీ సమీర్ మోడీ?
మోడీ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్.మహిళ ఫిర్యాదు వివరాలు 2019లో పరిచయం ఏర్పడి, వ్యాపార సహకారం పేరుతో సన్నిహిత సంబంధం ఏర్పడిందని, తర్వాత ఆయన బలవంతంగా ప్రవర్తించారని బాధితురాలు పేర్కొంది. తనకు హాని చేస్తానని బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొంది.
