Let's talk: editor@tmv.in
వేధించడంలో హింసకూ హద్దుంటుంది: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

వేధించడంలో హింసకూ హద్దుంటుంది: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

Pinjari Chand
2 డిసెంబర్, 2025

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై జరుగుతున్న విచారణను సోమవారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కే. శివకుమార్ తీవ్రంగా విమర్శించారు. హింసకు హద్దుంటుంది. ఇది అన్యాయం. ప్రతీకారంతో జరుగుతున్న రాజకీయ చర్యలు అని ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ ఆస్తి కాదు. వారు పార్టీ అధ్యక్షులు కాబట్టి వారు వాటాలకు సంరక్షకులు. ఇది వారి వ్యక్తిగత ఆస్తి కాదు. వోహ్రాజీ, అహ్మద్ పటేల్ జీ ఇలా అందరి కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలను కాపాడటానికి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపీపై తీవ్రంగా విమర్శలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో జరుగుతున్న దర్యాప్తును ‘తీవ్ర అన్యాయం’గా అభివర్ణించారు. అధికారులు ప్రతీకార విధానాన్ని అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి చర్యలు ఎటువంటి ఫలితాలను సాధించవని ‘నైతిక విలువలను దెబ్బతీస్తాయని’ ఆయన అన్నారు. ఇది అన్యాయం. వేధింపులకు కూడా ఒక పరిమితి ఉంది. వేధించాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీని జైలుకి పంపినా ఆయన విచారించరు అని అన్నారు. శివకుమార్ ఢిల్లీ వెళ్లి వివిధ అంశాలపై అన్ని పార్టీల సమావేశం ఏర్పాటు చేయాలని తాను భావిస్తున్నానని తెలిపారు.

కాంగ్రెస్ నాయకుల స్పందన

ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజ్యసభ ఎంపీ, సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మనుసింగ్వీ కూడా బీజేపీపై మండిపడ్డారు. డబ్బు లేదు, అక్రమం లేదు, లావాదేవీ లేదు... అయినా బీజేపీ మనీ లాండరింగ్ ని ఊహించుకుంటోంది. ఇది నేషనల్ హెరాల్డ్ కేసు కాదు, నేషనల్ హరాస్‌మెంట్ కేసు. ఈడీ అనుసరిస్తున్న విధానాన్ని ప్రతిపక్షం మీదే పూర్తిగా దృష్టి పెట్టే రంగుగా ఉండడం అని వ్యంగ్యంగా దుయ్యబట్టారు.

నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యం

ఈ కేసు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి చేసిన ఫిర్యాదు ఆధారంగా ప్రారంభమైంది. అసోసియేటేడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్ )కు సంబంధించిన నిధుల దుర్వినియోగం జరిగిందని ఆయన ఆరోపించారు.