Let's talk: editor@tmv.in
వేట్లపాలెం పేలుడు ఘటన…22కు చేరిన మృతుల సంఖ్య

వేట్లపాలెం పేలుడు ఘటన…22కు చేరిన మృతుల సంఖ్య

Panthagani Anusha
3 మార్చి, 2026

కాకినాడ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటనలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత నెల 28న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో మరొకరు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. దీంతో ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మొత్తం సంఖ్య 22కు చేరుకుందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి జె. నరసింహ నాయక్ సోమవారం అధికారికంగా ధృవీకరించారు.

ఫిబ్రవరి 28న కాకినాడ జిల్లాలోని వేట్లపాలెం గ్రామంలో ఉన్న లైసెన్స్ కలిగిన క్రాకర్ల తయారీ యూనిట్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన రోజు 21 మంది దుర్మరణం చెందగా వారిలో 9 మంది మహిళలు ఉండటం కలచివేస్తోంది. పేలుడు ధాటికి యూనిట్ పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు అక్కడ పనిచేస్తున్న కార్మికులు చెల్లాచెదురుగా పడిపోయారు. తీవ్రంగా గాయపడిన మరో 9 మందిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. కాగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో మరో నలుగురు నుంచి ఐదుగురి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

వేట్లపాలెం పేలుడు ఘటన…22కు చేరిన మృతుల సంఖ్య - Tholi Paluku