
వెనిజువెలాను నడిపించడానికి అమెరికా సిద్ధం: ట్రంప్
రాత్రిపూట సైనిక ఆపరేషన్ చేసి వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను కట్టుదిట్టమైన భద్రత మధ్య అమెరికా తీసుకువచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకారం, ఈ ఆపరేషన్ ద్వారా అమెరికా ‘వెనిజువెలాను నడిపించగలదు’ అలాగే ఆ దేశపు విస్తృత చమురు వనరులను ఇతర దేశాలకు అమ్మి లాభం పొందగలదు అని స్పష్టం చేశారు. మదురో శనివారం మధ్యాహ్నం న్యూయార్క్‌లోని విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. రాత్రిపూట ఆయన, భార్య సిలియా ఫ్లోర్స్ను కరాకాస్‌లోని వారి నివాసం నుంచి సైనిక బేస్‌లోంచి తీసుకువచ్చారు. మదురో ప్రభుత్వాన్ని ‘విదేశీ ఆక్రమణ’గా పేర్కొన్నది. అమెరికా మదురోపై నార్కో-టెరరిస్ట్ కుట్రలో పాల్గొన్నారంటూ క్రిమినల్ చార్జీలు మోపారు.అమెరికా అధికారులు వెనిజువెలాలో రహస్యంగా కొన్ని నెలలుగా పరిణామాలను నిశితంగా గమనిస్తూ, ప్రణాళిక ప్రకారం ఈ ఆపరేషన్ ను చేపట్టారు. 2003 ఇరాక్ యుద్ధం తరువాత అమెరికా చేసిన అత్యంత స్ఫుర్తిదాయకమైన రెజీం చేంజ్ చర్య అని విశ్లేషకులు పేర్కొన్నారు. న్యూయార్క్‌లోని విమానాశ్రయం చేరిన తరువాత, మదురోని హెలికాప్టర్ లో మాన్‌హాటన్‌కు తీసుకెళ్లారు. అక్కడ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ వాహనాల కాంక్లేవ్, ఆర్మడ్ కారులోకి ఎక్కించారు. ఆయనను అక్కడి నుంచి డీఈఏ కార్యాలయానికి తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, మదురో చిరునవ్వుతూ డీఈఏ ఏజెంట్స్ చేతుల్లో పట్టుకొని వెళుతున్న దృశ్యాలు ఉన్నాయి.
అమెరికాను వ్యతిరేకించే వారికి ఇదో హెచ్చరిక
ట్రంప్ ప్రకటన ప్రకారం, ఆపరేషన్ అత్యంత విజయవంతం అయ్యిందని, అమెరికా సార్వభౌమత్వాన్ని క్షేమంగా కాపాడే వారందరికీ ఇది హెచ్చరిక అని తెలిపారు. మేం వెనిజువెలా దేశాన్ని నడిపిస్తాం, సురక్షిత, సముచిత మార్పు వచ్చే వరకు అని చెప్పారు. ఆయన చమురు పరిశ్రమను పునరుద్ధరించి, ఎక్కువ చమురుని ఇతర దేశాలకు అమ్మాలని భావిస్తున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మదురోపై 2020లో నార్కో-టెరరిస్ట్స్ కుట్ర కేసులు దాఖలు అయ్యాయి. శనివారం ఆయన, భార్యపై కొత్తగా ఆరోపణలు నమోదు చేశారు. అమెరికా ప్రభుత్వ ప్రకారం మదురో పాలన అత్యంత అవినీతి, చట్టవిరుద్ధ, డ్రగ్ వ్యాపారంపై ఆధారపడింది.
రాత్రిపూట ఆపరేషన్
1990లో పనామా నేత మాన్యూయల్ నొరియేగాను అమెరికా అదుపులోకి తీసుకుని 36 ఏళ్లు పూర్తయిన రోజే వెనిజువెలా పై మెరుపుదాడి జరగడం, మదురోను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జెనరల్ డాన్ కైన్ మాట్లాడుతూ, మదురో ఏం తింటాడో, ఏ వస్త్రాలు ధరిస్తాడో, పెంపుడు జంతువుల వివరాలు కూడా తెలుసుకొని ఈ ఆపరేషన్ చేశామన్నారు. రాత్రి సమయంలో కనీసం ఏడు పేలుళ్లు జరగగా, కరకాస్ ప్రజలు ఏం జరగిందోనని భయపడ్డారు. మదురో ప్రభుత్వాన్ని అమెరికా పై విదేశీ ఆక్రమణ అని ఆరోపించింది. మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న తరువాత కరాకాస్ ప్రశాంతంగా ఉంది. కొన్నిస్థలాలు వాణిజ్య, దుకాణాలు, గ్యాస్ స్టేషన్లు మూతబడ్డాయి. కొన్ని రోడ్లలో కేవలం కొంతమంది ప్రజలు మాత్రమే వచ్చి వెళ్లారు. ప్రజలు ఇంకా భయంతో ఉన్నారని కరాకాస్ నివాసి డేవిడ్ లియల్ (77) చెప్పారు.
చట్టవిరుద్ధత పై ప్రశ్నలు
అమెరికా మదురోను చట్టవిరుద్ధంగా ఆధీనంలోకి తీసుకుందా? అనే చర్చ కొనసాగుతోంది. అంతర్జాతీయ చట్ట నిపుణులు, ఈ చర్యను అంతర్జాతీయ న్యాయాన్ని ఉల్లంఘించడంగా భావిస్తున్నారు. పదహారో పోప్ లియో శనివారం వెనిజువెలా ప్రజల సంక్షేమం కోసం ముందు రావాలని, హింసను విడనాడలని కోరారు. వెనిజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేజ్ అమెరికాను మదురోను విడుదల చేయమని డిమాండ్ చేస్తూ అతనే దేశంలో చట్టబద్ధమైన అధ్యక్షుడు అని ప్రకటించారు. ఆ దేశ ఉన్నత న్యాయస్థానం ఆమెను తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించింది.
మదురోపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్ర వ్యాఖ్యలు
పదవీచ్యుతుడైన వెనిజువెలా నియంత నికోలస్ మదురో పాలనను ‘క్రూరంగా ప్రజలను అణిచివేసే, నేరపూరిత పాలన’గా కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా విమర్శించారు. మదురో పాలన అంతర్జాతీయ నిబంధనలను ఘోరంగా ఉల్లంఘించిందన్న స్పష్టమైన అభిప్రాయంతోనే కెనడా ప్రభుత్వం అతనిపై అదనపు ఆంక్షలు విధించిందని ఆయన తెలిపారు. ఆదివారం సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్టు చేసిన కార్నీ, 2025 మార్చిలో ఏర్పడిన కెనడా కొత్త ప్రభుత్వం తీసుకున్న తొలి కీలక నిర్ణయాల్లో మదురో పాలనపై అదనపు ఆంక్షలు విధించడాన్ని ఒకటిగా ప్రస్తావించారు.
ఈ ఆంక్షల వెనుక ఉన్న కారణాలను వివరిస్తూ మదురో చేసిన అంతర్జాతీయ శాంతి, భద్రతకు తీవ్రమైన భంగం, వ్యవస్థాగతంగా, విస్తృతంగా జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలు, అలాగే అవినీతి చర్యలను ఖండించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని కార్నీ స్పష్టం చేశారు.
అప్పటి నుంచే గుర్తింపు లేదన్న కెనడా
2018లో వెనిజువెలాలో జరిగిన అధ్యక్ష ఎన్నికలు దొంగతనంగా జరిగాయని అభిప్రాయపడుతున్న కెనడా, అప్పటి నుంచే మదురో పాలనను ‘చట్టబద్ధం కాని ప్రభుత్వం’గా పరిగణిస్తూ అధికారిక గుర్తింపును ఇవ్వలేదని వెల్లడించారు.
వెనిజువెలాప్రజల భవిష్యత్తుపై ఆశ
వెనిజువెలా విషయంలో కెనడా దృక్పథాన్ని కార్నీ వివరించారు. వెనిజువెలా ప్రజలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, శాంతి, సమృద్ధి లభించే అవకాశాన్ని కెనడా ప్రభుత్వం స్వాగతిస్తోందని వ్యాఖ్యానించారు. అలాగే వెనిజువెలా ప్రజలే నాయకత్వం వహించే, శాంతియుతంగా చర్చల ద్వారా జరిగే అధికార మార్పిడికి కెనడా ఎప్పటి నుంచో మద్దతు ఇస్తోందని తెలిపారు. ఈ మార్పు ప్రజాస్వామ్య ప్రజాభిప్రాయాన్ని గౌరవించే విధంగా ఉండాలన్నదే కెనడా ఆకాంక్షగా పేర్కొన్నారు.
అంతర్జాతీయ చట్టాలకు కెనడా కట్టుబాటు
కెనడా విదేశాంగ విధానంలో భాగంగా చట్టపాలన, సార్వభౌమాధికారం, మానవ హక్కుల పరిరక్షణకు తమ దేశం పూర్తిగా కట్టుబడి ఉందని కార్నీ తెలిపారు. అన్ని పక్షాలు అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. వెనిజువెలా ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే సార్వభౌమ హక్కును కెనడా పూర్తిగా సమర్థిస్తోంది. శాంతియుత, ప్రజాస్వామ్య సమాజంలో తమ దేశాన్ని నిర్మించుకునే హక్కు వారికి ఉందని కార్నీ అన్నారు. సంక్షోభాల పరిష్కారానికి బహుపాక్షిక దౌత్యమే మార్గమని కెనడా విశ్వసిస్తోందని తెలిపారు. ఈ విషయంలో అంతర్జాతీయ భాగస్వాములతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని చెప్పారు.
కెనడా పౌరులకు సహాయం
కోలంబియాలోని బోగోటా నగరంలో ఉన్న తమ రాయబార కార్యాలయం, కాన్సులర్ అధికారుల ద్వారా కెనడా పౌరులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అలాగే వెనిజువెలా శరణార్థులకు కెనడా కొనసాగిస్తూ వస్తున్న మద్దతు భవిష్యత్తులోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అప్పుడే అరెస్ట్ చేయాల్సింది.. జాన్ బోల్టన్
అమెరికా జాతీయ మాజీ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్, మదురోను తొలగించే ప్రణాళికను డొనాల్డ్ ట్రంప్ తొలి అధ్యక్ష కాలంలోనే ప్రతిపాదించామని తెలిపారు. అయితే ఆ అంశంపై ట్రంప్ దృష్టిని సారించకపోవడంతో ఆ ప్రణాళిక ముందుకు సాగలేదని ఆయన సీఎన్ఎన్ కు చెప్పారు. ట్రంప్ అప్పట్లో వెనిజువెలా చమురుపై ఎక్కువ ఆసక్తి చూపారని, అయినప్పటికీ తమ ప్రయత్నాలు ఫలించలేదని బోల్టన్ అన్నారు. అప్పట్లో వెనిజువెలా ప్రతిపక్షం, ఆర్థిక ఒత్తిడి వల్లే మదురో పాలన కూలిపోతుందని నమ్మిందని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ అనుమతి లేకుండానే మదురు అరెస్ట్ జరిగిందని కూడా ఆ కథనం పేర్కొంది.
