Let's talk: editor@tmv.in
వీరభద్ర సింగ్ ప్రజల కోసమే ఆలోచించారు: ప్రియాంక గాంధీ

వీరభద్ర సింగ్ ప్రజల కోసమే ఆలోచించారు: ప్రియాంక గాంధీ

Pinjari Chand
14 అక్టోబర్, 2025

హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకుడు వీరభద్ర సింగ్ ఎల్లప్పుడు ఇక్కడి ప్రజల గురించే ఆలోచించే వారని, ఆయన నరనరాల్లో హిమాచల్ మేలునే ఆలోచించే వారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కొనియాడారు. సోమవారం షిమ్లాలో ఆయన విగ్రహా ఆవిష్కరణ సందర్బంగా ఆయనను స్మరించుకున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడికి ప్రచారానికి వచ్చినప్పుడు ప్రజలను అడిగి తెలుసుకున్నాం. ప్రజలంతా వీరభద్రసింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన దుకాణాల దగ్గరికి వచ్చి అందరితో కలివిడిగా మాట్లాడేవారని తెలిసింది. సీఎంగా ఉండి కూడా ఆయన సాధారణ వ్యక్తిలా ప్రజలతో వ్యవహరించారు. పార్టీలోనే సామాన్యులను అక్కున చేర్చుకునే సుగుణాలున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో నెహ్రు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సొనియాగాంధీ ఇలా అందరూ ప్రజలను కలుపుకుని ముందుకుపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందున్నారన్నారు. అలాగే వీరభద్ర సింగ్ కూడా అలాగే ప్రజా అభిమానాన్ని సొంతం చేసుకున్నారని ఈ సందర్భంగా ప్రశంసించారు. అలాగే నాకు కూడా ఇక్కడి పర్వతాలు, లోయలు, భూమితో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఆయన ఇక్కడి అడవులను, సహజవనరులను కాపాడారు. మనం కూడా ఆయన ఆశయాన్ని కొనసాగించాలన్నారు. మహత్మాగాంధీ ఏ విధంగా సత్యం పై నడవాలని సూచించారో అదే విధంగా వీరభద్రసింగ్ జీవితాన్ని గడిపారన్నారు.

రాహుల్ గాంధీ కూడా దేశ ప్రజల గురించి నిర్భయంగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతున్నారని వివరించారు. దేశంలోని అన్ని వర్గాలను బలోపేతం చేసేందుకు రాహుల్ కష్టపడుతున్నారని తెలిపారు. ఇక్కడ భారీవర్షాలు, వరదలు వచ్చి నష్టపోతే కేంద్ర ప్రభుత్వం ఆదుకోలేదని విమర్శించారు.బీజేపీ వారు కేవలం ఎన్నికల్లో గెలవడమే ముఖ్యమనుకుంటున్నారు. ప్రజలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ వీరభద్ర సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

చాలా సంతోషంగా ఉంది

సోనియాగాంధీ ఇక్కడకు రావడం మాకు చాలా సంతోషంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య ప్రతిభాసింగ్ అన్నారు. ఆమె రావడం గర్వంగా ఉందన్నారు.ఆయన మన మధ్యలో లేకున్నా ఆశయాలు ఉన్నాయని వాటిని నెరవేర్చడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జూన్ లోనే విగ్రహావిష్కరణ జరగాల్సి ఉంది. కానీ ఇక్కడ వర్షాలు, వరదల కారణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టలేకపోయాం. వాయిదా వేయాల్సి వచ్చింది.చివరకు ఈరోజు(సోమవారం) నిర్వహించుకుంటున్నామని ప్రతిభా సింగ్ తెలిపారు. అనేకమంది కాంగ్రెస్ అగ్రనాయకులు ఇక్కడికి రావడం సంతృప్తిగా ఉందన్నారు. దీంతో ఈ కార్యక్రమం ప్రత్యేకంగా మారిందన్నారు. మీరు ఈ కార్యక్రమానికి రావడం దేశంలోని ప్రజలకు ఓ బలమైన సందేశాన్ని పంపుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులను ఎప్పటికీ మర్చిపోమన్న సంకేతాలను పంపడం శుభపరిణామం అన్నారు.

వీరభద్ర సింగ్ ప్రజల కోసమే ఆలోచించారు: ప్రియాంక గాంధీ - Tholi Paluku