Let's talk: editor@tmv.in
విశాఖలో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

విశాఖలో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

FL - YUGDR
2 అక్టోబర్, 2025

ట్రాన్సిట్ హాల్ట్ లో భాగంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి బుధవారం ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 11.20 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు వచ్చిన ముఖ్యమంత్రికి ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు.

అనంతరం 11.35 గంటలకు హెలికాప్టర్ లో విజయనగరం బయలుదేరి ముఖ్యమంత్రి వెళ్లారు

విశాఖపట్నం ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం పలికిన ఎంపీ శ్రీ భరత్, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎన్.టి.ఆర్. వైద్య సేవా ట్రస్టు చైర్మన్ సీతంరాజు సుధాకర్, ఏపీ గ్రోవర్స్ ఆయిల్స్ & సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గండిబాబ్జీ, సీఎంవో కార్యదర్శి ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేంధిర ప్రసాద్ తదితరులు ఉన్నారు

విశాఖలో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం - Tholi Paluku