Let's talk: editor@tmv.in
విశాఖలో నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ కు ఏర్పాట్లు ప్రారంభం

విశాఖలో నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ కు ఏర్పాట్లు ప్రారంభం

Dantu Vijaya Lakshmi Prasanna
4 నవంబర్, 2025

విశాఖలో ఈ నెల 14,15 తేదీల్లో నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ 2025 సన్నాహక ఏర్పాట్లపై మంత్రి లోకేష్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు . పార్టనర్ షిప్ సమ్మిట్‌కు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయుష్ గోయల్, అశ్వనీ వైష్టవ్ హాజరు కానున్నారు. ఇప్పటివరకు 45 దేశాల నుంచి 300 మంది వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు వస్తున్నట్లు సమాచారం ఉంది. సమ్మిట్ లో 12 మల్టీ లాటరల్ ఆర్గనైజేషన్స్, 72 మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ పాల్గొంటారు. 48 స్పీకింగ్ సెషన్స్ లో సెక్టార్ల వారీగా వివిధ అంశాలపై విస్తృతంగా చర్చలు జరుపుతారు. ఈసారి పార్టనర్ షిప్ సమ్మిట్ లో 410 ఎంవోయూలపై సంతకం చేయబోతున్నట్లు, వీటిద్వారా రూ.9.8లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయంటూ లోకేష్ తన ఎక్స్ ఖాతా లో పోస్ట్ చేశారు. కాగా ఈ సమ్మేట్ లో పాల్గొనడానికి వివిధ దేశాలలో పర్యటించి అన్నీ రంగాల పారిశ్రామికవేత్తలను ముఖ్య మంత్రి, లోకేష్ ఇప్పటికే ఆహ్వానించారు. ఈ సమ్మిట్ పై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

విశాఖలో నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ కు ఏర్పాట్లు ప్రారంభం - Tholi Paluku