Let's talk: editor@tmv.in
విశాఖలో అట్టహాసంగా ‘ఐఎఫ్ఆర్’ సిటీ పరేడ్

విశాఖలో అట్టహాసంగా ‘ఐఎఫ్ఆర్’ సిటీ పరేడ్

Panthagani Anusha
21 ఫిబ్రవరి, 2026

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ రోడ్ గురువారం సాయంత్రం జనసంద్రమైంది. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ–2026 వేడుకల భాగంగా నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ సిటీ పరేడ్’ ప్రేక్షకులకు కనులపండువగా నిలిచింది. దేశ సైనిక శక్తి, నావికాదళ క్రమశిక్షణను ప్రతిబింబించేలా సాగిన ఈ వైభవ కవాతును ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై సమీక్షించారు. నావికాదళ ప్రధానాధికారి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సముద్ర తీరాన వేలాదిమంది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

కదం తొక్కిన త్రివిధ దళాలు

పరేడ్‌లో భారత నావికాదళం, సైన్యం, వైమానిక దళం కోస్ట్ గార్డ్ బృందాలు సమన్వయంతో మార్చ్ చేస్తూ తమ వృత్తిపరమైన నైపుణ్యాన్ని చాటాయి. వీరికి తోడుగా వివిధ దేశాల నౌకాదళ ప్రతినిధులు, ఎన్‌సీసీ, సీ క్యాడెట్ కార్ప్స్ రాష్ట్ర పోలీస్ దళాలు ఉత్సవ యూనిఫార్మ్‌లను ధరించి క్రమశిక్షణతో కదం తొక్కాయి. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. "భారతదేశ సముద్ర శక్తికి, రక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్ పెరుగుతున్న ప్రాధాన్యతకు ఈ వేదిక నిదర్శనం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంలో

నావల్ ఎయిర్ ఆర్మ్ నిర్వహించిన గగనతల విన్యాసాలు పరేడ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మిగ్ -29కె యుద్ధ విమానాలు ఆకాశంలో విన్యాసాలు చేయగా సముద్రంలో యుద్ధనౌకలు సమన్వయంతో కదిలి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సూర్యాస్తమయం తర్వాత సముద్రంలో నిలిచిన యుద్ధనౌకలను విద్యుత్ దీపాలతో అలంకరించడంతో తీర ప్రాంతం వెలుగులతో మెరిసిపోయింది. అనంతరం లేజర్ షో, డ్రోన్ ప్రదర్శనలు, బాణసంచా కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

‘సముద్రాల ద్వారా ఐక్యత’ అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ వేడుకల్లో ఐఎఫ్ఆర్‌తో పాటు ‘మిలన్-2026’, ‘నావల్ సింపోజియం కాన్క్లేవ్’ వంటి మూడు ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమాలను ఏకకాలంలో నిర్వహించడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి.