Let's talk: editor@tmv.in
విజయ్‌ అంటే అందుకే ఇష్టం.. రష్మిక కామెంట్స్

విజయ్‌ అంటే అందుకే ఇష్టం.. రష్మిక కామెంట్స్

Thaduri Lalitya
9 నవంబర్, 2025

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ బాటలో అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది రష్మిక. ఓ యూట్యూబ్ చిట్‌చాట్‌లో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయ్. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం రూమర్స్ నడుస్తున్న వేళ...ఇంటర్వ్యూ లో రష్మిక స్వయంగా చెప్పిన మాటలు ఆమె పై పుకార్లకు బలం చేకూర్చింది.

‘థామా’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ వంటి సినిమాలతో ఇటీవల సక్సెస్ తో దూసుకెళ్తున్న ఈ భామ, ఇప్పుడు పర్సనల్ లైఫ్‌తో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. అభిమానులు అడిగిన ప్రశ్నకు నవ్వుతూ సమాధానమిచ్చిన రష్మిక... ‘నా డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలంటే? ప్రపంచం మొత్తం నాకు వ్యతిరేకంగా నిలబడినా, నా కోసం ఒంటరిగా యుద్ధం చేసే హీరో కావాలి, నన్ను లోతుగా అర్థం చేసుకుని, ప్రతి సిచుయేషన్‌ను నా సైడ్ నుంచి చూసే వ్యక్తి. మంచి హార్ట్, స్ట్రాంగ్ పర్సనాలిటీ. నా కోసం బుల్లెట్‌ను కూడా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. అలాంటి వాడి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా’ అంటూ తన మనసులో మాట బయట పెట్టేసింది.

ఇది సినిమా డైలాగ్ కాదు, రియల్ లైఫ్ విష్ అంటూ ఆమె తనకు కాబోయే వరుడి గుణగణాలు ప్రకటించింది. ఇక గేమ్ ఆడుతూ వచ్చిన ‘కిల్ మ్యారీ డేట్’ ప్రశ్నకు ఆమె ఆన్సర్ సూపర్ హిట్ అనే చెప్పాలి. "డేటింగ్ అయితే యానిమేషన్ హీరో నరుటోతో... ఎందుకంటే అతని ఎనర్జీ నాకు ఇష్టం! పెళ్లంటే... విజయ్ దేవరకొండ!" అంటూ బాంబ్ పేల్చేసింది. ఆడియన్స్ అరుపులు, కంగ్రాట్స్‌తో హాల్ మార్మోగింది. రష్మిక థాంక్స్ చెప్పి స్మైల్ ఇచ్చింది. అక్టోబర్ 3న వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగినట్టు వైరల్ న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రష్మిక మాటలతో మరింత కన్ఫర్మ్ అయినట్టు కనిపిస్తోంది.

పరోక్షంగా స్పందించిన రష్మిక సమయం వచ్చినప్పుడు అధికారికంగా చెప్తా అంటూ ఒక్క మాటతో మిస్టరీ పెంచింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనున్నట్టు టాక్ జోరుగా ఉంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’తో కెమిస్ట్రీ చూపిన ఈ జోడీ... రియల్‌లో కూడా ఒక్కటయ్యేనా? ఫ్యాన్స్ ఎక్సైట్‌మెంట్ కూడా ఈ వార్తలపై ఓ రేంజ్ లో ఆసక్తి నెలకొంది.

విజయ్‌ అంటే అందుకే ఇష్టం.. రష్మిక కామెంట్స్ - Tholi Paluku