Let's talk: editor@tmv.in
వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఐఐఎం- జమ్మూ కీలక పాత్ర

వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఐఐఎం- జమ్మూ కీలక పాత్ర

Yellarthi Chennabasava
6 నవంబర్, 2025

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) జమ్మూ, భారత ప్రభుత్వ వికసిత్ భారత్ 2047 దృష్టికోణానికి అనుగుణంగా, నూతన ఆవిష్కరణలు, వ్యాపార సృజన (ఎంట్రప్రెన్యూర్షిప్), గ్లోబల్ ఎడ్యుకేషన్ లో జాతీయ స్థాయిలో ముందుబాటుగా నిలుస్తోంది. 2016లో స్థాపించబడిన ఈ సంస్థ, కాలక్రమేణా తన విద్యా, పరిశోధనా పరిధిని విస్తరించుకుంటూ జమ్మూ కాశ్మీర్ తో పాటు దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతోంది.

సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని, ఐఐఎం జమ్మూ దేశంలోనే తొలి వైవిధ్య,సమానత్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మహిళలు, గ్రామీణ యువత, వెనుకబడిన వర్గాలకు వ్యాపార, విద్యా అవకాశాలను పెంచేందుకు ఈ కేంద్రం కృషి చేస్తోంది.

విద్యార్థుల మానసిక, భావనాత్మక శ్రేయస్సును ప్రోత్సహించేందుకు ఆనందం – సుఖశాంతి కేంద్రం యోగా, ధ్యానం, జీవన నిర్వహణ పాఠ్యాంశాలను బోధనలో భాగంగా తీసుకురావడం జరిగింది. పాలనలో మార్పులు, సమర్థత పెంపు దిశగా పాలనలో ఆవిష్కరణ–మార్పుల కేంద్రం జమ్మూ–కాశ్మీర్ ప్రభుత్వంతో కలిసి డేటా ఆధారిత, సాంకేతికత ఆధారిత పరిపాలన విధానాలను అమలు చేస్తోంది. దీని ద్వారా అధికారులు తమ నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు విధానాల సమర్థతను పెంచుకునేందుకు అవకాశం పొందుతున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఐఐఎం జమ్మూ 19 దేశాల్లోని 21 విద్యా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పటివరకు 32 మంది విద్యార్థులు అంతర్జాతీయ మార్పిడి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యా రంగంలో, ఆరోగ్య సేవలు, హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రత్యేక పట్టా కోర్సులను స్థానిక వైద్య–సాంకేతిక సంస్థలతో కలిసి ప్రారంభించింది. దీనితోపాటు ఆరు సంవత్సరాల ద్వంద్వ సాంకేతిక–వ్యవస్థాపక విద్య కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది

.

ఇది ఐదు సంవత్సరాల ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ గుర్తింపును పొందింది. జాతీయ స్థాయిలో 2024లో 42వ స్థానం, 2025లో 22వ స్థానం సాధించడం ద్వారా ప్రముఖ విద్యాసంస్థల్లో స్థానం సంపాదించింది.

అంతర్జాతీయ పరిశోధనా పత్రికల్లో 110 పరిశోధనా వ్యాసాలను ప్రచురించడమే కాక, 28 దేశాల నిపుణులతో సంయుక్త పరిశోధనలు నిర్వహించింది.ఆవిష్కరణ, సమగ్రాభివృద్ధి, అంతర్జాతీయ అనుసంధానంపై ప్రత్యేక దృష్టి ఉంచి, ఐఐఎం జమ్మూ పరిశోధన, వ్యాపారారంభం, పాలనలో మార్పులు ద్వారా జమ్మూ–కాశ్మీర్ ప్రాంతాభివృద్ధికి, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు సహకరిస్తోంది.

వికసిత్ భారత్ 2047** ప్రధాన లక్ష్యాలు:

ఆర్థిక వృద్ధి:

• స్థిరమైన, అధిక సామర్థ్యంతో ఆర్థిక వ్యవస్థను నిర్మించడం.

• దేశీయ ఉత్పత్తి, పరిశ్రమ, సేవా రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించడం.

సామాజిక సమానత్వం:

• మహిళలు, యువత, గ్రామీణ, వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం.

• విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో సమగ్ర అభివృద్ధి.

విద్య, నైపుణ్యాభివృద్ధి:

• ప్రతి యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడం.

• సాంకేతిక, విజ్ఞాన, మేనేజ్‌మెంట్, పరిశోధన రంగాల్లో ప్రతిభను పెంపొందించడం.

పాలనా నైపుణ్యాలు, సాంకేతికత:

• ప్రభుత్వ విధానాలను సాంకేతికత ఆధారంగా మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా చేయడం.

• ప్రజల పాలనలో భాగస్వామ్యాన్ని పెంపొందించడం.

అంతర్జాతీయ అనుసంధానం:

• ప్రపంచ దేశాలతో శాస్త్రీయ, సాంకేతిక, ఆర్థిక, విద్యా, పరిశోధన సంబంధాలను మరింత విస్తరించడం.

సృజనాత్మకత ,పరిశోధన:

• వ్యాపారం, పరిశ్రమ, సేవల రంగాల్లో కొత్త ఆవిష్కరణలు, పరిశోధన మరియు నూతన పరిష్కారాలను ప్రోత్సహించడం.

వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఐఐఎం- జమ్మూ కీలక పాత్ర - Tholi Paluku