
వాల్తేరు డివిజన్‌లో ఇద్దరు జీఎంల హడావుడి
కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉంది.. వాల్తేరు డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్ఎం) పరిస్థితి. ఒక సార్ కి ఇద్దరు బాసు ఉండడంతో ఎటు వెళ్లాలో.. ఏం చేయాలో.. తెలియక అయోమయంలో,అదే సమయంలో ఒత్తిడికి గురవు తున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు జీఎం ని ప్రకటించిన కేంద్రం.. ఇంకా గెజిట్ విడుదల చేయకపోవడంతో ఎవరికి వారే అన్న చందంగా మారింది. ఇద్దరు జీఎంల మధ్య నలిగిపోతున్న డీఆర్ఎం.. ఇదేం బాధరా భగవంతుడా అనుకుంటూ బదిలీ కోసం పాట్లు పడుతున్నారు
ఆరేళ్లయిన అగచాట్లే
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించి ఆరేళ్లు దాటినా, క్షేత్రస్థాయిలో మాత్రం 'మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కి' అన్నట్లుగా ఉంది. కేంద్ర, రాష్ట్ర రాజకీ యాలు, రైల్వే బోర్డు నిర్లక్ష్యం కారణంగా కార్యక లాపాలు మొదలు కాలేదు. మూడు నెలల క్రితం దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎం గా నియమితులైన సందీప్ మాధుర్ నెల రోజులుగా విశాఖలోనే ఉం టూ, గెస్ట్ హౌస్ నుంచి కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. ముడసర్లోవ ప్రధాన కార్యాలయ పనులు పర్యవేక్షిస్తూ, డీఆర్ఎం లలిత్ బోరాతో కలిసి సమీక్షలు, పర్యటనలు చేస్తున్నారు. అయితే జోన్ ఏర్పాటు కాగితాలకే పరిమితం కావడంతో డీఆ ర్ఎం పై ఒత్తిడి మొదలైంది.
నాకొద్దు బాబోయ్.!
ఒక సార్ రివ్యూలు చేస్తూ బయలుదేరితే, మరొక సార్ ఫోన్లో ఏర్పాట్లు చేయమని ఆదేశాలు జారీచేస్తారు. ప్రస్తుతం వాల్తేరు డీఆర్ఎం లలిత్ బోరా, డివిజనల్ అధికారుల పరిస్థితి ఇదే. ఒకవైపు దక్షిణ కోస్తా రైల్వే జోన్ కొత్త జీఎం, మరోవైపు ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం కలిసి డీఆర్ఎంతో చెడుగుడు ఆడుకుం టున్నారు. ముందు రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ కొత్త జీఎం రివ్యూలతో, ఆ తర్వాత రోజు ప్రస్తుత జీఎం పర్యటనలతో డీఆర్ఎం క్షణం తీరిక లేకుండా ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు. ఇటీవల ఒక జీఎం పర్యటనలో ఉన్న సమయంలోనే, మరో జీఎం ఫోన్ చేసి లైన్లు పరిశీలించేందుకు వస్తున్నానని, ఏర్పాట్లు చేయాలని హుకుం జారీ చేశారు.
సమీక్లలు కూడా ఇరు జీఎంలు పోటాపోటీగా నిర్వహి స్తుండటంతో, వారికి సమాధానం ఇవ్వడంలోనూ, ఏర్పాట్లలోనూ అధికారులు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. దీంతో అధికారుల్లో కొందరు తమ ఉద్యోగాలపై విరక్తి చెందుతూ తలలు పట్టుకుంటు న్నారు. ఇక డీఆర్ఎం లలిత్ బోరా పరిస్థితి అయితే చెప్పాల్సిన పనిలేదు. కుటుంబంతో గడిపే తీరిక కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాల్తేరులో పనిచేయడం కంటే, ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం మంచిదంటూ తోటి అధికారుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయన ముంబైకి బదిలీ చేయాలంటూ రైల్వే బోర్డును కోరినట్లు సమాచారం.
గెజిట్ లేకపోవడమే అసలు సమస్య
వాల్తేరు డివిజన్ లో నెలకొన్న మొత్తం 'తలపోటు' వ్యవహారానికి ప్రధాన కారణం.. జోన్ కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాకపోవడమే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గెజిట్ వస్తేనే సందీప్ మాధుర్ జోన్ కు అసలైన జనరల్ మేనేజర్ గా వ్యవహరించ గలరు. అప్పుడు కార్య కలాపాలు సజావుగా సాగుతాయి. గెజిట్ తో పాటు కార్యాచరణ ప్రకటించిన తర్వాతే.. జీఎం తో పాటు అసిస్టెంట్ జీఎం, 10 విభాగాలు, వాటి ప్రిన్సిపల్హెచ్ఎ్వడీలు, సిబ్బంది సహా మొత్తంగా దాదాపు 180 మంది అధికారుల నియామకం పూర్తవుతుం ది. వీరి నియామకం తర్వాతే జోన్ ఆపరేషన్స్ మొదలయ్యే అవకాశం ఉంది. అధికారుల నియామకాలు ఒక్కొక్కటిగా జరుగుతున్నా, గెజిట్ రాక పోవడం వల్లే ఈ దుస్ధితి దాపురించిందని వాల్తేరు అధికారులు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, దసరా కు కూడా జోన్ ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు.
ఇది నా సంస్థానమంటూ..!
దక్షిణకోస్తా రైల్వే జోన్కు కొత్త జీఎంను నియమించినా గెజిట్ విడుదల చేయకపోవడంతో భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోనే వాల్తేరు డివిజన్ కొనసాగుతోంది. జీఎం సందీప్ మాధుర్ జోన్ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తుండగా.. ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం పరమేశ్వరన్ ఫంక్వాలా కూడా హడావుడి మొదలుపెట్టారు. ఇంకా గెజిట్ రాకపోవడంతో వాల్తేరు డివిజన్ కు తానే జీఎం నంటూ వరుస పర్యటనలతో హడావుడి చేస్తున్నారు.
పట్టించుకోని కూటమి పెద్దలు
కేంద్రంలో విపరీతమైన పలుకుబడి ఉందని చెప్పే ఉత్తరాంధ్రకే కింద కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, విశాఖ ఎంపీ ఎం శ్రీ భరత్, విశాఖ వాసి అయిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ లు ఈ సమస్య పరిష్కారానికి ఏమాత్రం ప్రయత్నం చేయటం లేదు. సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ గానే కాక రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ విశాఖ రైల్వే సమస్యలపై కనీస స్పందన కూడా కనిపించటం లేదు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖతో మాట్లాడి జోన్ వ్యవహారాలను ఒక జిఎం మాత్రమే పర్యవేక్షించేలా మౌఖిక ఆదేశాలకు కూడా తీసుకురాలేకపోయారు. అంతేకాదు పెండింగ్లో ఉన్న గెజిట్ నోటిఫికేషన్ గురించి పట్టించుకున్న పాపనే పోలేదు.
చురుగ్గా తాత్కాలిక కార్యాలయం పనులు
వీఎంఆర్టీఏ 'ది డెక్ తాత్కాలిక కార్యా లయం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ కావడంతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. కొత్త జోన్కు ఇప్పటికే ప్రిన్సిపల్ చీఫ్
మెకానికల్ ఇంజినీర్ (పీసీఎంఏ), ఎలక్ట్రికల్ విభాగంలో హెచ్ఎజీ అధికారి (హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్)తో సహా మరో ఇద్దరి నియామకాలు పూర్త య్యాయి. వీలైనంత త్వరగా టెంపరరీ ఆఫీస్ ను అందుబాటులోకి తెస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, ఈ కార్యాలయంలో విధులు ప్రారంభించాలన్నా గెజిట్ విడుదల తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు. దీంతో గెజిట్ ఎప్పుడొ స్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.
