Let's talk: editor@tmv.in
వారు కూడా మానసిక అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది

వారు కూడా మానసిక అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది

FL - BHAVN
10 అక్టోబర్, 2025

ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ థీమ్ ను అనుసరించి మానసిక ఆరోగ్యసేవలను విస్తృత పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రాథమిక ఆరోగ్యంలో చేర్చడం అవసరం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య శిభిరాల్లో, విద్యాసంస్థల్లో సైతం మానసిక ఆరోగ్య సంరక్షణను ఒక భాగంగా చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల మానసిక చికత్స గురించి ఉండే సోషల్ స్టిగ్మా తగ్గుతుంది.

అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించే పోలీస్, ఆగ్నిమాపక, ఉపాధ్ధ్యాయుల వంటి అందరికీ సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ కు సంబంధించిన శిక్షణ అందించాలి. ఇది తక్షణ ఆలంబనకు ఆస్కారం ఏర్పరిచే చర్య.

సంక్షోభ సమయాల్లో క్షేత్ర స్థానానికి చేరుకోవడంలో జాప్యం జరగవచ్చు. కాబట్టి ఆన్లైన్ లేదా ఫోన్ ద్వారా కౌన్సెలింగ్ లేదా చికిత్స అందించే సేవలను విస్తృతం చెయ్యాలి.

ముఖ్యంగా విపత్తు ప్రభావిత ప్రాంతాలలో కమ్యూనిటీ సపోర్ట్ గ్రూప్ లను ఏర్పరుచుకోవాలి. ఇక్కడ బాధితులు తమ అనుభవాలను పంచుకోవడం వల్ల మానసిక ఉపశమనం దొరుకుతుంది. సాంస్కృతిక , స్థానిక పద్ధతుల్లో సహాయం అందించే వ్యవస్థల రూపకల్పన జరగాలి.

మానసిక అనారోగ్యం కూడా శారీరక బాధ వంటిదే అని తెలియజేసే అవగాహనా కార్యక్రమాల రూపకల్పన అవసరం. దీని ద్వారా సమాజంలో నెలకొని ఉన్న స్టిగ్మా తొలగిపొయ్యేందుకు ప్రయత్రించాలి. ఇందుకు విస్తృత ప్రచారం అవసరమవుతుంది. మానసిక ఆరోగ్యనిపుణులు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ప్రచార కార్యక్రమాల రూపకల్పన చేసి ప్రచారం చెయ్యాలి.

వ్యక్తులుగా...

• ప్రతి వారు తమ మానసిక ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం.

• ఇందుకోసం తప్పకుండా ప్రతిరోజూ క్రమం తప్పకుండా కనీసం అరగంట పాటు వ్యాయామం చెయ్యాలి. రోజులో కనీసం7,8 గంటల పాటు నిద్ర పోవాలి. ఈ రెండూ కూడా మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తాయి.

• పది పదిహేను నిమిషాల ధ్యానం, శ్వాసక్రియకు సంబంధించిన వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతాయి.

• కేవలం సోషల్ మీడియాలో సమయం గడపకుండా తరచుగా స్నేహితులను, బంధువులను కలుసి సమయం గడపడం వల్ల ఒంటరితనం తగ్గుతుంది.

• నిరంతరం వార్తా స్రవంతిలో సమయం గడపడం కూడా మానసిక ఆరోగ్యానికి చెరుపు చేస్తుంది. కనుక ఆ పని మానుకోవాలి. ఒన నీర్ణీత సమయం పాటు నమ్మకమైన వార్తా శ్రవణం లేదా పఠనం మాత్రమే చెయ్యాలి.

• దీర్ఘకాలికంగా ఆందోళనగా ఉండడం, డిప్రెషన్ గా అనిపించడం, తెలియని ఒత్తిడి వేధించడం, నిద్ర లేమి వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చెయ్యకుండా నిపుణుల సహాయం తీసుకోవాలి.

వారు కూడా మానసిక అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది - Tholi Paluku