
వారణాసిలో జాతీయ వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
వారణాసిలోని డాక్టర్ సంపూర్ణానంద్ స్పోర్ట్స్ స్టేడియంలో ఆదివారం జనవరి 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్న 72వ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు.
ఈ టోర్నమెంట్ లో భాగంగా జనవరి 4 నుండి 11 వరకు పోటీలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, సంస్థల నుండి 58 జట్లు, దాదాపు 1,000 మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడనున్నారు.
భారతీయ వాలీబాల్‌లోని ఉన్నత ప్రమాణాలను, క్రీడా స్ఫూర్తిని, ప్రతిభను ఈ టోర్నమెంట్ చాటిచెబుతుందని ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. వారణాసిలో ఈ స్థాయి క్రీడలు నిర్వహించడం వల్ల నగరంలో క్రీడా మౌలిక సదుపాయాల బలోపేతానికి, అథ్లెటిక్ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలకు ప్రధాన కేంద్రంగా వారణాసి ప్రతిష్టను ఇది మరింత పెంచుతుందని వెల్లడించారు.
