Let's talk: editor@tmv.in
విషాదం వెంట మరో విషాదం

విషాదం వెంట మరో విషాదం

Pinjari Chand
16 సెప్టెంబర్, 2025

వరుస విషాదాలు ఆ కుటుంబాలను చిన్నాభిన్నం చేశాయి. మృత్యుదూత ఏమైనా తలుపులు తెరిచాడా అన్నట్లు ఒకరి చావు ఖననానికి వెళ్లి తిరిగి వస్తుండగా వెనువెంటనే మరో ప్రమాదం, వారి చివరి చూపులకు వెళ్లి వస్తుంటే మరో దుర్ఘటన ఇలా అనుకోని మరణాలతో ఆ కుటుంబం, ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

ఒక ఘటన తరువాత.. మరొకటి

శనివారం హరిద్వార్కు చెందిన ఓ వ్యక్తి కారు అదుపుతప్పి 16 అడుగుల లోయలో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న బంధువులు కారులో ఆయన అంత్యక్రియలకు వెళ్లి అదే రోజు రాత్రి వస్తుండగా జైపూర్ లోని రింగురోడ్డు దగ్గర కారు అదుపుతప్పి అండర్ పాస్లో పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు చనిపోయారు.

ముగ్గురిని స్థానికులు కాపాడారు. ఆదివారం వీరి అంత్యక్రియలు బిల్వారా జిల్లాలోని పులియా కాలా గ్రామంలో జరిగాయి. వీరి చివరిచూపులకు వెళ్లిన ఏడుగురు బంధువులకూ దురదృష్టం వెంటాడింది. స్నానానికి పక్కనే ఉన్న ఖారీ నదిలోకి దిగారు. అందులో మునిగిపోయారు. వారి వెంట వచ్చిన బంధువులు వారిని కాపాడారు. అయితే అప్పటికే ముగ్గురు మరణించారు. నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వరుసగా శనివారం నుంచి సోమవారం వరకు వరుస సంఘటనలు చోటుచేసుకున్నాయి.

విషాదం వెంట మరో విషాదం - Tholi Paluku