
వైష్ణోదేవి యాత్ర ప్రారంభం
భారీ వర్షాలతో జమ్మూ స్తంభించిపోయింది. అందులో భాగంగా ఆగష్టు 25న భీభత్సం సృష్టించిన వర్షం దాటికి వరదలు వెల్లువలా వచ్చాయి. దీంతో ఆలయానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి.అందువల్ల శ్రీ మాతా వైష్ణోదేవి యాత్ర నిలిపి వేశారు. అయితే ఈ కొండచరియలు విరిగిపడడం వల్ల34 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అనుకూలమైన వాతావరణం ఉండడంతో బుధవారం వైష్ణోదేవి యాత్ర పున:ప్రారంభమైంది. సుమారు 22 రోజుల విరామం తరువాత మొదలు కావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. మాతా ది పై భక్తితో నినాదాలు చేస్తూ, వైభవంగా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. అయితే యాత్రకు వచ్చే వారు చెల్లుబాటులో ఉన్న గుర్తింపు కార్డు తీసుకువచ్చి సిబ్బందికి సహకరించాలని ఆలయ పాలకవర్గం సూచించింది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు నవరాత్రి వేడుకలకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు.
దర్శనానికి అనుమతినివ్వాలని భక్తుల ఆందోళన
జమ్మూలోని రియాసి జిల్లాలో త్రికూట కొండలలో ఉన్న వైష్ణోదేవి యాత్రను ప్రారంభించాలని ఇటీవల కొంతమంది భక్తులు నిరసన తెలిపారు. అందులో కొంతమంది భద్రతా సిబ్బందిని లెక్క చేయకుండా యాత్రకు పూనుకున్నారు. ఈ నెల 14 నే ప్రారంభించాలనుకున్నప్పటికీ అడపా,దడపా కురుస్తున్న వానల వల్ల దర్శనానికి అనుమతించలేదు. అయితే భక్తుల ఆందోళనలతో బుధవారం నుంచి యాత్ర ప్రారంభానికి ఆలయ మండలి అనుమతినిచ్చింది.దీంతో బేస్ క్యాంపులో వేచి ఉన్న వందలాది మంది భక్తులు తెల్లవారుజామునే యాత్రకు బయల్దేరారు.
ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన ఓ భక్తురాలు మీడియాతో మాట్లాడుతూ యాత్ర ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉంది. రెండు రోజుల కిందే మేం బృందంగా ఇక్కడికి వచ్చాం. అయితే దర్శనం అవుతుందా? లేదా అని భావించాం. కానీ యాత్రకు అధికారులు అనుమతినిచ్చారు.
