Let's talk: editor@tmv.in
వైష్ణోదేవి దర్శనానికి.. జమ్మూ వెళ్తున్నారా?

వైష్ణోదేవి దర్శనానికి.. జమ్మూ వెళ్తున్నారా?

FL - BHAVN
18 సెప్టెంబర్, 2025

తొలిపలుకు, ఆధ్యాత్మికం, పర్యాటకం:*

కొత్త ప్రదేశాల్లో పర్యటించడం, అక్కడి వైవిధ్యతను అందిపుచ్చుకోవడం అనేది ప్రతి ఒక్కరికీ ఆనందం కలిగించే అంశమే. ప్రకృతి నేపథ్యంగల వాతావరణం కలిగే ప్రాంతాలైతే మనసుని మైమరిపిస్తుంటాయి. ఆ ప్రకృతి ఒడిలో కొలువైన ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్ళడమైతే అది మరింత ఆనందాన్ని కలిగించే అంశం. అలాంటి ప్రదేశమే. ఉత్తరాధి ప్రాంతంలోని జమ్మూ. ఆ చల్లని ప్రాంతాన కొలువైన మహామాత వైష్ఝోదేవి ఆలయ సందర్శనం జీవితంలో మహాభాగ్యంగానే భావిస్తారు భక్తులు.

ఈ నేపథ్యంలో ఈ సారి నవరాత్రి వైష్ణోదేవి వెళ్లాలని అనుకుంటున్నారా? మరి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఈ యాత్రకు సిద్దమవుతున్నపుడు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. కొన్ని తప్పక గుర్తుంచుకోవాలి. కొన్ని బుకింగ్స్ ముందుగానే చేసుకోవాలి. ఎలాంటి ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి? అవి బయలుదేరే సమయాలు వంటి సమాచారం ముందే తెలిస్తే మనకు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు తెలెత్తవు. వీటన్నింటిని అనుసరించి ప్రయాణ ప్రణాళిక రూపొందించుకోవాలి.

నవరాత్రి తొమ్మిదిరోజుల పాటు జరిగే పండుగ. నవరాత్రుల్లో ఉత్తర భారతదేశంలోని వైష్ణోదేవి దర్శనం చేసుకోవాలని చాలా మంది ఆశపడతారు. అలాంటి ఆశ, ఉద్దేశ్యం ఉన్న వారికి పనికొచ్చే ముఖ్య సమాచారం ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా తెలుసుకోవాల్సిందేమిటంటే ఇక్కడికి వెళ్లాలంటే ముందు యాత్రికులుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక వేళ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయినా జమ్ములోని యాత్రా కార్డ్ కలెక్షన్ పాయింట్ దగ్గరకి వెళ్లి ఫోన్ నెంబర్, వయసు వంటి వివరాలను అందిస్తే మీకు అక్కడ మీ ఫోటో తీసుకుని ఐడి కార్డ్ ఒకటి మీకు అందిస్తారు. యాత్ర పూర్తయిన తర్వాత మీరు మీ కార్డును వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. యాత్రికులు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, శానిటైజర్ ఉపయోగించడం, సామాజిక దూరం పాటించడం వంటి కోవిడ్ జాగ్రత్తలు పాటించడం తప్పని సరి. ఇండియన్ రైల్వే కూడా నవరాత్రి ప్రత్యేక రైలును నడుపుతుంది.

రిజిస్టర్డ్ యూజర్ తన యూజర్ ఐడి పాస్వర్డ్ తో వెబ్ సైట్ లోకి ఎంటర్ కావచ్చు. ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. వెబ్ సైట్ వివరాలు www.maavaishnodevi.org . యాత్ర రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి యాత్ర వివరాలను నమోదు చేసుకోవాలి. జనరేట్ యాత్రా రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ప్రింటవుట్ తీసుకోవాలి. వైష్ణోదేవి టైమింగ్స్ వేసవిలో ప్రత్యక్షంగా ఆరతి ఉదయం 6.20 నుంచి 8.00 వరకు, సాయంత్రం 7.20 నుంచి 8.30 వరకు అందుబాటులో ఉంటుంది. శీతాకాలంలో ప్రత్యక్ష హారతి అత్కాఆర్తి ఉదయం 6.20 నుంచి 8.00 వరకు సాయంత్ర 6.20 నుంచి 8.00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో భక్తులను సందర్శనకు అనుమతించరు.

అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్రీపెయిడ్ సిమ్ జమ్ములో అనుమతించరు. కనుక కనెక్టివిటి కోసం జమ్ముకు వెళ్లినపుడు తప్పనిసరిగా పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకువెళ్లాలి. ఒకవేళ మరచిపోతే అక్కడి చిన్న దుకాణాల్లో సైతం యాత్రి సిమ్ 350/- కి అందుబాటులో ఉంటాయి. ఈ సిమ్ నెల పాటు పనిచేస్తుంది. రోజుకు 1.5 డెటా, ఒక నెల పాటు అపరిమిత కాల్స్ లభిస్తాయి.

వైష్ణోదేవి యాత్ర: హెలీకాప్టర్, ఎలక్ట్రిక్ వెహికిల్ బుకింగ్

వైష్ణోదేవి యాత్ర ప్రారంభమయ్యేది బాన్ గంగా నుంచి. ఇక్కడికి చేరుకోవడానికి ఆటోలో కూడా వెళ్లవచ్చు. బాన్ గంగా చేరుకున్న తర్వాత అక్కడ మనకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఘోడే(పోనీ) లేదా పాల్కీ కూడా మనం వినియోగించుకోవచ్చు. ఆడ్కువారి నుంచి ఆలయం వరకు మనం ప్రయాణం చెయ్యడానికి 4 రకాల సౌకర్యాలు మనకు అందుబాటులో ఉంటాయి. ఎలక్ట్రిక్ వ్యాన్లు కూడా అందుబాటులో ఉంటాయి. దీని కోసం ముందుగా వెబ్ సైట్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మరచిపోతే మాత్రం ఆఫ్ లైన్ బుకింగ్ అవకాశం లేదని గుర్తుంచుకోవాలి. 5-6 గంటల వెయిటింగ్ తప్పకుండా ఉంటుది. ఇంకో ఆప్షన్ ఉంటుంది అదేంటంటే హెలీకాప్టర్ తీసుకోవచ్చు.

బైరోబాబాను దర్శనం చేసుకోవడానికి రోప్ వే ద్వారా వెళ్ల వచ్చు. వైష్ణోదేవి రోప్ వే ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉంటుంది. టికెట్లు ఆఫ్ లైన్ లో బుక్ చేసుకోవాలి. ఒకొక్కరికి 100 రూపాయలు. ఇది చాలా మందికి సౌకర్యవంతంగా అనిపిస్తుంది.

www.maavaishnodevi.org మాత్రమే శ్రీమాత వైష్ణోదేవి పుణ్యక్షేత్రం బోర్డ్ వారి అధికారిక వెబ్ సైట్. ఇదికాక మరే వెబ్ సైట్ అయినా నకిలేదే అని గుర్తుంచుకోవాలి. SMVDSB కత్రా తరపున ఆన్లైన్ టిక్కెట్ను బుక్ చేయడానికి ఏ ట్రావెల్ ఏజెంట్కు అనుమతి లేదు. కనుక అలాంటి బుకింగులు చెల్లవు. ఇక్కడ చెప్పిన అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే బుకింగ్ వివరాలు ఉన్నాయి. ఇది కాకుండా "MATA VAISHNODEVI APP" అనే అధికారిక మొబైల్ ఆప్ కూడా అందుబాటులో ఉంది. దీనిలో కూడా బుకింగ్ మరియు ఇతర వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా సందేహ నివృత్తికి, ఇతర సమాచారం కోసం 01991-234804 నంబర్ తో 24x7 కాల్ సెంటర్ను, వాట్సప్ నెంబర్ 9906019494 లో సంప్రదించవచ్చు.

వైష్ణోదేవి దర్శనానికి.. జమ్మూ వెళ్తున్నారా? - Tholi Paluku